సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్న సీనియర్ ప్రొడ్యూసర్ గురుపాదం..

  • Publish Date - August 29, 2020 / 07:01 PM IST

Veteran Producer Gurupadam Interview: తాను సూపర్‌స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్‌లతో భారీ మల్టీస్టారర్ చిత్రం తీస్తున్నానని కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు ప్రముఖ నిర్మాత, జి.ఆర్.పి.ఆర్ట్ పిక్చర్స్ అధినేత గురుపాదం.

గతంలో సీనియర్ హీరోలతో జి.ఆర్.పి.ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి కొంత విరామం తర్వాత సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్న ప్రముఖ నిర్మాత గురుపాదం తన సినిమాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు, భవిష్యత్తు ఆలోచనల గురించి 10టీవీతో మాట్లాడారు.

‘వయ్యారిభామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు గురుపాదం. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఆయన విజయవంతమైన చిత్రాలు నిర్మించి అగ్రనిర్మాతగా పేరొందారు.

కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్న గురుపాదం త్వరలో సినిమారంగంలో కమ్‌బ్యాక్‌తో పాటు డిజిటల్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన సొంత ఓటీటీ కూడా లాంచ్ చేయనున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి సినిమాలు తియ్యాలని కథలు వింటూ కాంబినేషన్లు కూడా సెట్ చేసే ఆలోచనలో ఉన్నారాయన. త్వరలో మరిన్ని వివరాలు తెలియచేస్తామన్నారు గురుపాదం.