ప్రముఖ రచయిత సి.ఎస్.రావు ఇకలేరు..

ప్రముఖ సినీ రచయిత సి.ఎస్. రావు నేడు హైదరాబాద్‌లో కన్నుమూశారు..

  • Published By: sekhar ,Published On : April 14, 2020 / 12:30 PM IST
ప్రముఖ రచయిత సి.ఎస్.రావు ఇకలేరు..

Updated On : April 14, 2020 / 12:30 PM IST

ప్రముఖ సినీ రచయిత సి.ఎస్. రావు నేడు హైదరాబాద్‌లో కన్నుమూశారు..

సుప్రసిద్ధ సినీ, నవలా, నాటక రచయిత శ్రీ సి.ఎస్.రావు (85) నేడు హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు చింతలపెంట సత్యనారాయణ రావు.
మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం ‘ప్రాణం ఖరీదు’, ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’, జాతీయ అవార్డు చిత్రం ‘ఊరుమ్మడి బతుకులు’, ‘నాయకుడు వినాయకుడు’, ‘మల్లెమొగ్గలు’ వంటి ఎన్నో సినిమాలకు ఆయన కథలు అందించారు. 

Veteran Writer C.S. Rao Passes away
ఎన్టీఆర్ ‘సరదా రాముడు’, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సొమ్మొకడిది సోకొకడిది’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు సి.ఎస్. రావు. నాటక రంగానికి విశేషమైన సేవ చేసి ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. ఎందరో నటీనటులకి ఆచార్యులుగా కూడా వ్యవహరించారు. వీరు ప్రస్తుతం చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 

Read Also : నాగ్ ఉండగా ఇంకొకరు వంట చేయడమా?.. కుకింగ్‌లోనూ ‘కింగే’- కోడలు పిల్లకి వంట రాదు..
సి.ఎస్.రావుకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సింగపూరులో ఉండడం వల్ల రాలేని పరిస్థితి. లాక్‌డౌన్  నియమాలను గౌరవించి ఎవ్వరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయవద్దని కుటుంబ సభ్యులు సినీపరిశ్రమ మిత్రులని, శ్రేయోభిలాషులని కోరారు. బుధవారం హైదరాబాదులోనే సి.ఎస్. రావు అంత్యక్రియలు జరగనున్నాయి.

Veteran Writer C.S. Rao Passes away