NTR – Vetrimaaran : ప్లీజ్ నాతో సినిమా చేయండి.. ఎన్టీఆర్ రిక్వెస్ట్.. వెట్రిమారన్ రియాక్షన్ ఏంటంటే..?

ఎన్టీఆర్ కి వెట్రిమారన్ తో సినిమా చేయాలని ఉందని వైరల్ గా మారింది.

Vetrimaaran Reaction on NTR Request for Tamil Movie

NTR – Vetrimaaran : ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం నిన్న చెన్నై వెళ్లి అక్కడ ఓ ప్రెస్ మెట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నా ఫేవరేట్ డైరెక్టర్ వెట్రిమారన్ సర్. ప్లీజ్ నార్ నాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయండి. నేను తెలుగులో డబ్ చేసుకుంటాను అని రిక్వెస్ట్ చేసారు. దీంతో ఎన్టీఆర్ కి వెట్రిమారన్ తో సినిమా చేయాలని ఉందని వైరల్ గా మారింది.

అయితే గతంలోనే ఎన్టీఆర్ తో సినిమాపై వెట్రిమారన్ స్పందించారు. వెట్రిమారన్ గతంలో విడుదల పార్ట్ 1 సినిమా ప్రమోషన్స్ లో హైదరాబాద్ కి వచ్చారు. అప్పుడు ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తో సినిమా గురించి స్పందించాడు. వెట్రిమారన్ మాట్లాడుతూ.. అసురన్ సినిమా తర్వాత లాక్ డౌన్ అయిన తర్వాత నేను ఎన్టీఆర్ గారిని కలిసాను. ఒక కథ కూడా చెప్పాను. అది అవ్వాల్సి ఉంది. కానీ నేనే కొంచెం సమయం తీసుకున్నాను. నాకు ఒక సినిమా అయి ఇంకో సినిమాకు వెళ్ళాలి అంటే కొంత టైం పడుతుంది. అందుకే ఆ సినిమాకు సమయం పడుతుంది అని తెలిపారు.

Also Read : Satya Dev : దీపావళి బరిలో సత్యదేవ్ సినిమా.. స్టార్ కాస్ట్‌తో పాన్ ఇండియా సినిమాగా..

దీంతో వెట్రిమారన్ ఆల్రెడీ ఎన్టీఆర్ కి కథ చెప్పాడని, కథ కూడా ఎన్టీఆర్ ఓకే చేసారని, ప్రస్తుతం వెట్రిమారన్, ఎన్టీఆర్ చేతిలో ఉన్న సినిమాలు అయ్యాక వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక వెట్రిమారన్ తమిళ్ లో ఆడుకాలం, వడచెన్నై, అసురన్, విడుదల.. లాంటి సినిమాలతో మెప్పించారు.