Satya Dev : దీపావళి బరిలో సత్యదేవ్ సినిమా.. స్టార్ కాస్ట్‌తో పాన్ ఇండియా సినిమాగా..
సత్యదేవ్ త్వరలో 'జీబ్రా' అనే సినిమాతో రాబోతున్నారు.

Satya Dev Zebra Movie Motion Poster Released Release Date Announced
Satya Dev : సత్యదేవ్ వరుస సినిమాలతో హీరోగా చేస్తూనే మరో పక్క పలు సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల కృష్ణమ్మ సినిమాతో వచ్చిన సత్యదేవ్ త్వరలో ‘జీబ్రా’ అనే సినిమాతో రాబోతున్నారు. సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనుంజయ, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, సత్య, సునీల్, జెన్నిఫర్.. పలువురు ముఖ్య పాత్రల్లో జీబ్రా సినిమా తెరకెక్కుతుంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ బ్యానర్స్ పై SN రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో జీబ్రా సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read : Suhas : మూడు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని తన సినిమాని పట్టించుకోని సుహాస్.. ఏం జరిగింది..?
తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ, ఇందులోని నటీనటులను పరిచయం చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. జీబ్రా సినిమా అక్టోబర్ 31న దీపావళి కానుకగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. మోషన్ పోస్టర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి జీబ్రా సినిమాతో సత్యదేవ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. మీరు కూడా జీబ్రా మోషన్ పోస్టర్ చూసేయండి..
ఇక దీపావళికి తెలుగులో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమా అమరన్ బరిలో ఉన్నాయి. ఇప్పుడు వీటితో ఈ లిస్ట్ లో పాటు జీబ్రా చేరింది.