VI Anand: ఫాంటసీతో పిచ్చెక్కిస్తున్న డైరెక్టర్.. ఈసారైనా హిట్టు దక్కేనా..?
టాలీవుడ్ లో వరుస ఫాంటసి చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్న దర్శకుడు విఐ ఆనంద్, తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ అనే మరో థ్రిల్లింగ్ ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

VI Anand Impressing With Fantasy Subjects But No Success
VI Anand: టాలీవుడ్‌లో వరుసగా ఫాంటసీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు విఐ ఆనంద్. ఈయన డైరెక్ట్ చేస్తున్న సినిమా వస్తుందంటే, కొత్తదనం గ్యారెంటీ అని ప్రేక్షకులు భావిస్తుంటారు. అంతలా తన సినిమాలతో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు విఐ ఆనంద్. ‘హృదయం ఎక్కడున్నది’ అనే మూవీతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు ఈ ట్యాలెంటెడ్ దర్శకుడు.
Ooru Peru Bhairavakona Teaser : గరుడ పురాణం.. సందీప్ కిషన్ కొత్త మూవీ కథ.. టీజర్ వచ్చేసింది!
ఆ సినిమా తరువాత తమిళంలో ఓ సినిమా చేసి అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘టైగర్’ మూవీతో విఐ ఆనంద్ సూపర్ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’ వంటి ఫాంటసీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ డైరెక్టర్. ఎక్కడికి పోతావు చిన్నవాడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత మళ్లీ సక్సెస్‌ను అందుకునేందుకు విఐ ఆనంద్ చాలా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి సందీప్ కిషన్‌తో మరో ఫాంటసీ మూవీతో మనముందుకు రాబోతున్నాడు ఈ వర్సెటైల్ డైరెక్టర్.
‘ఊరిపేరు భైరవకోన’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు ఈ డైరెక్టర్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇలా ఫాంటసీ చిత్రాలతో పిచ్చెక్కిస్తున్న ఈ డైరెక్టర్, మరి ఈ సినిమాతోనైనా తిరిగి సక్సెస్ అందుకుంటాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.