చెన్నై హాస్పిటల్ లో గొల్లపూడిని పరామర్శించిన వెంకయ్య

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2019 / 02:44 PM IST
చెన్నై హాస్పిటల్ లో గొల్లపూడిని పరామర్శించిన వెంకయ్య

Updated On : November 5, 2019 / 2:44 PM IST

అనారోగ్యంతో చెన్నైలోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ముఖ రచయిత, విమర్శకుడు, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు ఇవాళ(నవంబర్-5,2019)పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు,కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

సునిశితమైన విమర్శకు, ఆధ్యాత్మిక, రాజకీయాంశాలపై తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించడంలో గొల్లపూడి గారు పెట్టింది పేరని.. ఆయన త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలను పొందాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గొల్లపూడి ఇద్దరి కుమారులు ఉపరాష్ట్రపతిని కలిశారు.