Kiara Advani
Kiara Advani: అనగనగా ఓ అనుకువగల భార్య.. ఉత్తముడైన భర్త. ఇంతలో దాపురించిన ఓ వయ్యారి భామ. కొద్దిరోజుల క్రితం మన ఇండియన్ సినిమాలలో ఇలాంటి కథలు చాలానే చూశాం. అయితే, ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలే రాబోతున్నాయి. అయితే.. మరీ అంత ఉత్తములు.. మరీ అంత అనుకువగల భార్యలను ఇప్పుడు చూపించడం కష్టమేమో కానీ.. ఇప్పుడు కాలానికి తగ్గట్లుగా మార్పులు, చేర్పులతో ఇలాంటి కథలు ఇప్పుడు ఫుల్ ఫన్ పంచేందుకు రాబోతున్నాయి. ముందుగా బాలీవుడ్ లో గోవిందా నామ్ మేరా సినిమా రాబోతుంది.
NBK 107: బాలయ్యతో శృతి.. ఎవరి కోసం ఓకే చెప్పిందో?!
గత ఏడాది బాలీవుడ్ లో విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ ‘మిస్టర్ లేలే’ అనే సినిమా మొదలు పెట్టాడు. శశాంక్ ఖేతన్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కొద్దిరోజులు షూటింగ్ కాగానే మహమ్మారి కరోనా దాపురించింది. దీంతో ఆ సినిమా అలా ఉండిపోగా.. కరోనా పోయాక మళ్ళీ షూటింగ్ చేసేందుకు నటీనటుల డేట్స్, టెక్నీషియన్స్ ఇతర ప్రాజెక్టులతో ఇప్పటి వరకు అలా ఉండిపోయింది. కాగా మొత్తానికి ఇప్పుడు ఏకంగా గోవిందా నామ్ మేరా అనే టైటిల్ తో అదే సినిమా రీస్టార్ట్ చేస్తున్నారు.
Bheemla Nayak: లాలా భీమ్లా.. జనవరిలోనా.. వాయిదానా?
కాగా, ఈ సినిమాలో విక్కీ యంగ్ హజ్బెండ్‌గా, భూమి అతనికి భార్యగా నటిస్తుంటే వీరిద్దరి మధ్యలో నాటీ గాళ్‌ఫ్రెండ్‌గా కియారా కనిపించబోతోందట. దీంతో విక్కీ, భూమి పాత్రల సంగతెలా ఉన్నా కియారా రోల్ మీద మాత్రం అటెన్షన్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఇది గ్లామరస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ కావడంతో అసలే కియారా ఇలాంటి పాత్ర కోసం వెయిట్ చేయడంతో ఇప్పుడు బాలీవుడ్ స్పెషల్ ఫోకస్ పెట్టేసింది. ఒకటికి నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయిన కియారా ఈ సినిమాతో మరింత బిజీ కావడం ఖాయమని.. ఇప్పటి వరకు కియారా చేసిన పాత్రలకంటే ఇది ఫుల్ డోస్ అందాల విందు కాబోతుందంటున్నారు. మరి ఇది ఏ రేంజ్ అన్నది చూడాలంటే సినిమా రావాల్సిందే.