Sankranthiki Vasthunam two days collections : బాక్సాఫీస్ వ‌ద్ద విక్ట‌రీ వెంక‌టేష్ రాంపేజ్‌.. ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ రెండు రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

బాక్సాఫీస్ వ‌ద్ద విక్టరీ వెంక‌టేష్ న‌టించిన సంక్రాంతి వ‌స్తున్నాం మూవీ హ‌వా కొన‌సాగుతోంది.

Victory Venkatesh Sankranthiki Vasthunam two days collections

Sankranthiki Vasthunam two days collections : బాక్సాఫీస్ వ‌ద్ద విక్టరీ వెంక‌టేష్ న‌టించిన సంక్రాంతి వ‌స్తున్నాం మూవీ హ‌వా కొన‌సాగుతోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14 విడుద‌లైన ఈ మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. పుల్ కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావ‌డంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఈ చిత్రానికి జై కొడుతున్నారు. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.77 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద విక్ట‌రీ రాంపేజ్ కొన‌సాగుతున్న‌ట్లుగా పేర్కొంది. కాగా.. తొలి రోజు ఈ చిత్రం రూ.45 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి వెంక‌టేష్ కెరీర్‌లో మొద‌టి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన మూవీగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

RC 16 : రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌సీ16 కోసం జ‌గ‌ప‌తిబాబు ప‌డుతున్న క‌ష్టం చూశారా ?

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూస్తుంటే నేడు లేదా రేపు ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లో ఈజీగా చేరే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం సంక్రాంతి సెల‌వులు ఉండ‌డంతో ఈ చిత్రానికి భారీ క‌లెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Junior NTR : సైఫ్ అలీఖాన్ పై దాడి.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్‌లు క‌థానాయిక‌లు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.