Rajinikanth
Rajinikanth : తాము ఆరాధించే హీరోను చూడటానికి అభిమానులకు సమయం, సందర్భం అవసరం లేదు. పండుగరోజు, పుట్టినరోజు.. సినిమా వేడుకల్లో వారిని చూడాలని.. కలవాలని ఆశపడతారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక్కసారైనా చూడాలని ఆయన ఇంటి దగ్గర కాపు కాచే అభిమానులు వేల మంది ఉంటారు. అలా ఆయన ఇంటి ముందు అభిమానులు వేచి ఉన్న సందర్భంలో ఓ పెద్దావిడకు తిక్క రేగింది. ఒక్కసారిగా అభిమానులపై విరుచుకుపడింది. అసలింతకీ ఏం జరిగింది?
Sitara Ghattamaneni : శ్రీలీలతో సితార పాప.. గుంటూరు కారం సక్సెస్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్..
తమ అభిమాన హీరోను చూడాలని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. పండుగ సందర్భాలలో వారికి ప్రత్యక్షంగా శుభాకాంక్షలు చెప్పాలని ఆశపడుతుంటారు. ముఖ్యంగా పండుగరోజుల్లో సూపర్ స్టార్ ఇంటిముందు అభిమానులు రష్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రజనీకాంత్ బయటకు వచ్చి వారికి చేతులు ఊపి అభివాదం చేస్తుంటారు. శుభాకాంక్షలు చెబుతుంటారు. పొంగల్ సందర్భంలో రజనీకాంత్ చెన్నైపోయెస్ గార్డెన్ లోని ఆయన ఇంటిముందు అభిమానుల కోలాహలం కనిపించింది. ఎప్పటిలాగనే రజనీకాంత్ అభిమానులకు చేతులు ఊపి అభివాదం చేసారు. ఇక ఫ్యాన్స్ సంబరంలో మునిగిపోయారు. కానీ ఇదే సందర్భంలో ఒక పెద్దావిడకు చిర్రెత్తుకొచ్చింది. తలైవా అభిమానులపై చిందులు తొక్కారు.
Renu Desai : ఏనుగులకు స్నానం చేపిస్తున్న రేణుదేశాయ్.. పండక్కి కేరళలో రేణు.. పిల్లలేమో అక్కడ..
రజనీకాంత్ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఒక పెద్దావిడకి వేలాదిగా వచ్చిన అభిమానులతో సమస్య ఎదురైందట. తలైవా..తలైవా అని అరుస్తూ తమని ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారని పెద్దావిడ మాట్లాడారు. అక్కడ ఉన్న పోలీసులు, సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. అభిమానులపై అంత ఇష్టం ఉంటే రజనీకాంత్ వారిని తమ ఇంట్లోకి పిలుచుకోవాలి కానీ తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తాము కూడా ఇంటి పన్ను కడుతున్నామని ఆవేదనతో చెప్పారామె. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా.. రజనీకాంత్ లాల్ సలామ్ లోని రెండవపాటతో పాటు.. వేట్టైయాన్ మూవీ ఫస్ట్ లుక్ కూడా పొంగల్ సందర్భంగా విడుదల కావడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు.
ரஜினி வீட்டின் முன் குவிந்த ரசிகர்களிடம் வாக்குவாதம் செய்த பக்கத்து வீட்டுக்காரர் #Rajinikanth pic.twitter.com/MuslZRaqlC
— Ananth Vijay (@Ananth_Vijay01) January 15, 2024