Vidyut Jammwal : ఫొటో గ్రాఫర్ కు రూ. 40 వేల జాకెట్ గిఫ్ట్ ఇచ్చిన యాక్షన్ హీరో
విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal) యాక్షన్ హీరో. మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరినవారు. యాక్షన్ చిత్రాల్లో నటించి పేరు గడించారు.

Vidyut Jammwal
jacket worth Rs 40k : విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal) యాక్షన్ హీరో. మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరినవారు. యాక్షన్ చిత్రాల్లో నటించి పేరు గడించారు. ఇతను సహృదయంతో కలిగిన వాడు. అయితే..ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. 2021, ఏప్రిల్ 01వ తేదీ గురువారం ముంబైలో బైక్ పై ఉన్న విద్యుత్ జమ్వాల్ ను ఓ ఫొటోగ్రాఫర్ వీడియో తీయడం ప్రారంభించాడు. ఈ సమయంలో..హీరో విద్యుత్ గ్రీన్ కలర్ జాకెట్ ధరించి ఉన్నాడు. జాకెట్ చాలా బాగుంది సర్..ఎలా ఉన్నారు ? సర్ మీ జాకెట్ చాలా బాగుంది అని ఫొటోగ్రాఫర్ చెప్పాడు.
ఏంటీ అని విద్యుత్ అడగగా..జాకెట్ వెరీ నైస్ సర్ అంటూ మరోసారి చెప్పాడు. దీంతో వెనుక ఉన్న బ్యాగును తీసి బైక్ పై పెట్టి అమాంతం జాకెట్ విప్పి తీసుకో అని ఫొటోగ్రాపర్ కు ఇచ్చాడు. వెంటనే అతను సర్..టీ షర్ట్ కూడా బాగుందని అనడంతో నవ్వులు విరిశాయి. ఇది మీ కోసం..ప్రేమగా ఇస్తున్నాను..గాడ్ బ్లెస్ యు..అంటూ విద్యుత్ జమ్వాల్ వెల్లడించి..బ్యాగ్, హెల్మెట్ పెట్టుకుని బయలుదేరాడు. ఆ జాకెట్ విలువ రూ. 40 వేలు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను manav.manglani ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా పోస్టు చేశారు.
Read More : Corona in AP : ఏపీలో కరోనా రాకాసి..24 గంటల్లో ఎన్ని కేసులంటే..
View this post on Instagram