Corona in AP : ఏపీలో కరోనా రాకాసి..24 గంటల్లో ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం అటు అధికార వర్గాలు, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

Corona in AP : ఏపీలో కరోనా రాకాసి..24 గంటల్లో ఎన్ని కేసులంటే..

Ap Corona

ArogyaAndhra : ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం అటు అధికార వర్గాలు, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత సంవత్సర పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1271 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి అనంతపూర్, గుంటూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరులో 285, గుంటూరులో 279, విశాఖలో 189 కరోనా కేసులు వెలుగు చూశాయి.

31 వేల 809 శాంపిల్స్ పరీక్షించగా..1271 మంది కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 464 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారని వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 1,51,14,988 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 9, 00,365 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 లక్షల 85 వేల 003 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా..ఈ వైరస్ కారణంగా.. 7 వేల 220 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 8 వేల 142గా ఉంది.

14వ తేదీ 298
15వ తేదీ 147
16వ తేదీ 261
17వ తేదీ 253
18వ తేదీ 218
19వ తేదీ 246

20వ తేదీ 380
21వ తేదీ 368
22వ తేదీ 310
23వ తేదీ 492
24వ తేదీ 585
25వ తేదీ 758

26వ తేదీ 984
27వ తేదీ 947
28వ తేదీ 1005
29వ తేదీ 997
30వ తేదీ 993

31వ తేదీ 1184
01వ తేదీ 1271

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 61. చిత్తూరు 285. ఈస్ట్ గోదావరి 27. గుంటూరు 279. వైఎస్ఆర్ కడప 63. కృష్ణా 161. కర్నూలు 52. నెల్లూరు 43. ప్రకాశం 63. శ్రీకాకుళం 21. విశాఖపట్టణం 189. విజయనగరం 15. వెస్ట్ గోదావరి 12. మొత్తం కేసులు : 1271

Read More : Saradaga Kasepaina : ‘సరదాగా కాసేపైనా, సరిజోడై నీతో ఉన్నా.. సరిపోదా నాకీ జన్మకీ’.. అంటున్న ‘పాగల్’..