Nayanthara: “నయనతార” సౌత్ ఇండియా కాబట్టే పెళ్లి చేసుకున్నా.. డైరెక్టర్ విగ్నేశ్ శివన్ షాకింగ్ కామెంట్స్!

లేడీ మెగాస్టార్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సెలెబ్రెటీస్ వారి గ్లామర్ అండ్ స్టార్ ఇమేజ్ తో వచ్చిన క్రేజ్ ని.. కేవలం సినిమాలోనే కాదు వారి పర్సనల్ విషయంలోనూ క్యాష్ చేసుకుంటున్నారు.

Vignesh Shivan Comments On his Marriage

Nayanthara: లేడీ మెగాస్టార్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భర్త విగ్నేశ్ శివన్ బర్త్ డే ను దుబాయ్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది నయనతార.

Nayanthara Vignesh Shivan Slippers : నయనతార దంపతులపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటన

అయితే సెలెబ్రెటీస్ వారి గ్లామర్ అండ్ స్టార్ ఇమేజ్ తో వచ్చిన క్రేజ్ ని.. కేవలం సినిమాలోనే కాదు వారి పర్సనల్ విషయంలోనూ క్యాష్ చేసుకుంటున్నారు. నయనతార, విగ్నేశ్ శివన్ పెళ్లి వేడుకల డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌ సంస్థకు ఇచ్చారు.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఈ వేడుకులకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో ‘నయనతార’నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని విగ్నేశ్ ని ప్రశ్నించగా, విగ్నేశ్ బదులిస్తూ.. “యాంజెలీనా జోలీ కూడా పెళ్లి చేసుకోమని అడిగింది కానీ ఆవిడా సౌత్ ఇండియా కాదు కదా, అందుకనే చేసుకోలా” అంటూ సరదాగా బదులిచ్చాడు.