Vignesh Sivan : ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసిన విఘ్నేష్.. ధనుష్ వల్ల జరిగిన ఆ అవమానమే కారణమా..

గతకొంత కాలంగా కోలీవుడ్ స్టార్స్ ధనుష్, నయనతార మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Vignesh Sivan : ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసిన విఘ్నేష్.. ధనుష్ వల్ల జరిగిన ఆ అవమానమే కారణమా..

Vignesh sivan who deleted his Twitter account Is it because of Dhanush

Updated On : December 1, 2024 / 2:48 PM IST

Vignesh Sivan : గతకొంత కాలంగా కోలీవుడ్ స్టార్స్ ధనుష్, నయనతార మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తన డాక్యూమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా ఉన్న ‘నేనూ రౌడీనే’ సినిమా నుండి కొన్ని క్లిప్స్ కావాలి నయన్ అడిగితే దానికి అంగీకరించలేదు ధనుష్. కానీ నయన్ ధనుష్ పర్మీషన్ లేకుండానే ఆ సినిమాలోని క్లిప్స్ వాడుకుంది. ఇందుకు ధనుష్ తనపై 10కోట్ల నష్ట పరిహారం వేసాడు.

దీంతో నయనతార బహిర్గంగా ఓ నోట్ కూడా రిలీజ్ చేసింది. అలా నయన్ తన భర్త విఘ్నేష్, ధనుష్ ల మధ్య ఈ వివాదం జరుగుతూనే ఉంది. అయితే ఈ గొడవ ఇంకా సర్దుమనగక ముందే నయన్ భర్త విఘ్నేష్ ఊహించని షాక్ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారు. అయితే దీనికి కూడా ఓ కారణముందట. ఏంటంటే.. “ఇటీవల పాన్ ఇండియా డైరెక్టర్ల రౌండ్ టేబుల్ చర్చలో భాగమయ్యాడు విఘ్నేష్. అప్పుడు ధనుష్ కి సంబందించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాగే తన సినిమాలపై కూడా విమర్శలు వచ్చాయి. గత చిత్రం కాతువాకుల రెండు కాదల్ అసలు పాన్ఇండియ ప్రాజెక్ట్ కాదని ఎగతాళి చేసారు. అంతేకాదు రాబోయే చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పాన్ ఇండియా లెవెల్ కి సరిపోదని విఘ్నేష్ పై విమర్శలు కురిపించారు.

Also Read : Nidhhi Agerwal : ‘సీజ్ ది షిప్’.. హరిహర వీరమల్లు పై నిధి అగర్వాల్ అదిరిపోయే పోస్ట్..

అయితే అలా అందరిముందు తనని అవమానించడం సహించని విఘ్నేష్ ఆ మరుసటి రోజు తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ విషయం పై స్పందించలేదు విఘ్నేష్. ధనుష్ తో గొడవ కారణంగా తనపై వస్తున్న విమర్శల వల్లే విఘ్నేష్ ఇలా చేసాడని అంటున్నారు. ధనుష్ తో వివాదం కారణంగా ఆయన ఫ్యాన్స్ కొందరు విఘ్నేష్ ను టార్గెట్ చేసి ట్విట్టర్ లో విమర్శిస్తున్నారట అందుకే తీసేశారని ఇంకొందరు అంటున్నారు. మరి ఈ విషయం పై విఘ్నేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.