Maargan Trailer : విజయ్ ఆంటోని ‘మార్గన్’ ట్రైలర్ రిలీజ్.. మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్.. విలన్ ఎవరో ఎలుసా?

మీరు కూడా మార్గన్ ట్రైలర్ చూసేయండి..

Vijay Antony Ajay Dhishan Maargan Telugu Trailer Released

Maargan Trailer : తమిళ్ హీరో విజయ్ ఆంటోని చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ రెగ్యులర్ గా ప్రేక్షకులను పలకరిస్తాడు. బిచ్చగాడు సినిమా నుంచి తెలుగులో కూడా అతనికి మంచి మార్కెట్, ప్రేక్షకులు ఏర్పడ్డారు. దీంతో తన ప్రతి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ చేసి విజయం సాధిస్తున్నారు. త్వరలో విజయ్ యాంటోని మార్గన్ అనే సినిమాతో రాబుతున్నారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని నిర్మాణంలో లియో జాన్ పాల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Kannappa Song : ‘కన్నప్ప’ కోసం మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా పాడిన పాట రిలీజ్.. శ్రీకాళహస్తి అంటూ..

మర్డర్ మిస్టరీ – క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది. నేడు తెలుగులో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని జూన్ 27న విడుదల చేయనున్నారు. మీరు కూడా మార్గన్ ట్రైలర్ చూసేయండి..

మార్గన్ ట్రైలర్ చూస్తుంటే విలన్ కొంతమందిని ఓ డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తున్నట్టు, అతన్ని పట్టుకోడానికి పోలీసులు ట్రై చేస్తున్నట్టు, ఆ విలన్ కి నీళ్లతో ఏదో విద్య వచ్చినట్టు చూపించారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మరోసారి విజయ్ క్రైమ్ థ్రిల్లర్ తో హిట్ కొట్టబోతున్నాడు అని తెలుస్తుంది.

Also Read : Aa Naluguru : థియేటర్స్ బంద్ ఇష్యూ.. ‘ఆ నలుగురు’ ఎవరో చెప్పేసిన జనసేన నేత.. ఆ నలుగురు టాలీవుడ్ నిర్మాతలే..