Vijay Antony Hatya Movie : జూలై 21న విజయ్ ఆంటోనీ ‘హత్య’

వైవిధ్యభరితమైన క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు హీరో విజ‌య్ ఆంటోని(Vijay Antony). ఇటీవ‌ల 'బిచ్చగాడు 2' సినిమాతో సాలీడ్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న కొత్త చిత్రం 'హ‌త్య‌'(Hatya).

Vijay Antony Hatya Movie : జూలై 21న విజయ్ ఆంటోనీ ‘హత్య’

Vijay Antony Hatya Movie

Vijay Antony Hatya Movie Release Date : వైవిధ్యభరితమైన క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు హీరో విజ‌య్ ఆంటోని(Vijay Antony). ఇటీవ‌ల ‘బిచ్చగాడు 2’ సినిమాతో సాలీడ్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న కొత్త చిత్రం ‘హ‌త్య‌'(Hatya). బాలాజీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న రితికా సింగ్ (Ritika Singh) న‌టిస్తోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Naga Shaurya : ఆరోజు కొంచెం లేట్ అయ్యుంటే నాగశౌర్య ప్రాణాలకు ఇబ్బందయ్యేది.. దర్శకుడు పవన్ బసంశెట్టి!

డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. మురళీ శర్మ, జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ, ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.

Neena Gupta : మొద‌టి సారి లిప్‌కిస్‌ సీన్ చేసిన‌ప్పుడు.. నోటిని డెటాల్‌తో శుభ్రం చేసుకున్నా.. ఆ రాత్రి నిద్రపోలేదు

ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో సినిమా విడుద‌ల తేదీని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. జూలై 21 ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ పోస్ట‌ర్‌లో విజ‌య్ కంప్లీట్ మేక్ ఓవర్‌తో చూడటానికి చాలా కొత్తగా ఉన్నారు.