ముంబై రోడ్లపై అర్థరాత్రి అనన్యతో..
‘ఫైటర్’ షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

‘ఫైటర్’ షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో బాలీవుడ్‌కి పరిచయం అయిన అనన్యా పాండే ఈ సినిమాలో రౌడీతో రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ముంబై రోడ్లపై విజయ్, అనన్యలపై బైక్ రైడ్ షాట్స్ తీశారు. వీటికి సంబంధించిన పిక్స్ లీకయ్యాయి. విజయ్, అనన్యను తనకెదురుగా బైక్‌పై కూర్బోబెట్టుకుని రయ్ మంటూ దూసుకెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని ఫోటోల్లో అనన్య బైక్‌పై విజయ్ వెనుక కూర్చునిఉంది. పాన్ ఇండియా మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మిలతో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. విజయ్ నటిస్తున్న 10వ సినిమా ఇది. వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.