Vijay Devarakonda : దాని గురించి ఇక్కడెందుకు.. వేడుకల్ని ఎంజాయ్ చేయండి..
తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్ దేవరకొండని మీడియా జనగణమన సినిమా గురించి అడిగింది. దీంతో విజయ్ సమాధానమిస్తూ.......

Vijay Devarakonda comments on Janaganamana Movie
Vijay Devarakonda : ఇటీవల సైమా వేడుకలు చాలా గ్రాండ్ గా బెంగళూరులో జరిగాయి. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మంది తారలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఎన్నో సినిమాలు, నటులు, టెక్నీషియన్స్ అవార్డులని అందుకున్నారు. వచ్చిన సెలబ్రిటీలంతా మీడియాతో ముచ్చటించారు. సైమా కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ కూడా విచ్చేశాడు.
ఇటీవల పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. లైగర్ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన మరో సినిమా జనగణమన ఆగినట్టు వార్తలు వస్తున్నాయి. పూరి డ్రీం ప్రాజెక్టు అని జనగణమన సినిమా విజయ్ తో గ్రాండ్ గా మొదలుపెట్టారు. లైగర్ సినిమా నిరాశపరచడంతో ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం.
తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్ దేవరకొండని మీడియా జనగణమన సినిమా గురించి అడిగింది. దీంతో విజయ్ సమాధానమిస్తూ.. ”అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సైమా వేడుకల్ని ఎంజాయ్ చేయండి. దాని గురించి మర్చిపోండి” అని తెలిపాడు. దీంతో జనగణమన సినిమాపై విజయ్ స్పందించడానికి కూడా ఇష్టపడట్లేదు, నిజంగానే ఈ సినిమా ఆగిపోయిందా అనే వార్తలు మరింత ఎక్కువయ్యాయి.