గృహప్రవేశం చేసిన విజయ్ దేవరకొండ

ఫిలింనగర్ సమీపంలోని కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ..

  • Published By: sekhar ,Published On : November 27, 2019 / 05:58 AM IST
గృహప్రవేశం చేసిన విజయ్ దేవరకొండ

Updated On : November 27, 2019 / 5:58 AM IST

ఫిలింనగర్ సమీపంలోని కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటివాడయ్యాడు.. ఇంటివాడు అంటే పెళ్లి చేసుకున్నాడనుకునేరు.. మనోడు కొత్త ఇళ్లు కొన్నాడు. ఫిల్మ్‌నగర్ సమీపంలో రూ.15 కోట్లతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్టు ఫిలింనగర్ టాక్.
 తాజాగా ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేశాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మా, నాన్నా, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ దిగిన ఫోటో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది.

Vijay Devarakonda ecstatic to buy a new home
 విజయ్ గతంలోనే ఓ ఇళ్లు కొన్నాడు.. ఇప్పుడు కొన్నది రెండోది. ఈ రౌడీ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించనున్న ‘ఫైటర్’ జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

Image