Vijay Devarakonda : విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ వాలీబాల్ టోర్నమెంట్‌లో మ్యాచ్ ఆడతారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే..

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వాలీబాల్ టీమ్స్ ని పిలిపించి వారితో లీగ్ మ్యాచ్ లు కండక్ట్ చేయనున్నారు.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ వాలీబాల్ టోర్నమెంట్‌లో మ్యాచ్ ఆడతారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే..

Vijay Devarakonda Hyderabad Black Hawks conducting Biggest Volleyball Tournament Full Details Here

Updated On : January 7, 2024 / 7:24 AM IST

Vijay Devarakonda : ఇటీవల క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని గేమ్స్ కి లీగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే వాలీబాల్(volleyball) లీగ్ కూడా మొదలైంది. గత సంవత్సరం ప్రైమ్ వాలీబాల్ లీగ్ జరగగా పలు స్టేట్స్ నుంచి కొన్ని టీమ్స్ పాల్గొన్నాయి. అయితే అందులో హైదరాబాద్ బ్లాక్ హాక్స్(Hyderabad Black Hawks) అనే టీంకి విజయ్ దేవరకొండ కూడా ఓనర్. గత సంవత్సరం ఈ వాలీబాల్ లీగ్ ని, తన టీంని దగ్గరుండి మరీ ప్రమోట్ చేసాడు రౌడీ బాయ్.

అయితే ఈ సారి ఆ లీగ్ మొదలయ్యే ముందే విజయ్ తనే ఓ కొత్త లీగ్ మొదలుపెడుతున్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వాలీబాల్ టీమ్స్ ని పిలిపించి వారితో లీగ్ మ్యాచ్ లు కండక్ట్ చేయనున్నారు. అందులో బాగా ఆడిన వాళ్ళని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీం మెంబర్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. దీని గురించి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రకటన విడుదల చేసింది.

Also Read : Samyuktha – Kavya Thapar : వరుస హిట్స్‌తో సంయుక్త.. ఆఫర్స్‌తో కావ్య తాపర్..

రెండు రాష్ట్రాల్లో 16 నగరాల నుంచి దాదాపు 300 టీమ్స్, 4000 ప్లేయర్స్ తో బిగ్గెస్ట్ వాలీబాల్ టోర్నమెంట్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో జనవరి 19 నుండి జరగనుంది. మీరు, మీ టీం వాలీబాల్ లో తోపు అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అయి రిజిస్టర్ చేసుకోండి అని తెలిపారు. ఈ బిగ్గెస్ట్ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనాలనుకునే టీమ్స్ +?? ?????????? ఈ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోమని తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు, మీ టీం వాలీబాల్ బాగా ఆడితే విజయ్ దేవరకొండ వాలీబాల్ టోర్నమెంట్ లో రిజిస్టర్ చేసుకొని ఆడేయండి.