Vijay Devarakonda : సడెన్ గా కొత్త సినిమా ఓపెనింగ్ చేసి ఆశ్చర్యపరిచిన రౌడీ హీరో.. ఈసారి శ్రీలీలతో..
కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశాడు. సడెన్ గా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

Vijay Devarakonda new movie VD12 opening sreeleela as Heroine
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన లైగర్(Liger) సినిమా భారీ పరాజయం అయింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ప్రస్తుతం సమంతతో(Samantha) ఖుషి(Kushi) సినిమా షూట్ చేస్తున్నాడు. ఇటీవల కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ(Jersy) సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంట్లో విజయ్ దేవరకొండ స్పై పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. పోస్టర్ రిలీజ్ తోనే సినిమాపై అంచనాలు నెలకొల్పారు. కానీ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సడెన్ గా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

Sriwass : గోపీచంద్ తో KGF లాంటి యాక్షన్ సినిమా చేద్దామనుకున్నాను.. కానీ..
నేడు ఉదయం రామానాయుడు స్టూడియోలో విజయదేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా #VD12 పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమానికి శ్రీలీల కూడా రావడంతో ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని కన్ఫామ్ అయిపోయింది. దీంతో శ్రీలీల ఖాతాలో మరో సినిమా చేరింది. ఇక ఈ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.