Kushi Collections : మూడు రోజుల్లో 70 కోట్లు.. దూసుకుపోతున్న ఖుషి.. విజయ్ సినిమాకు 100 కోట్లు గ్యారెంటీ..

ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు 15 కోట్ల షేర్ కలెక్షన్స్ మొదటి రోజు వసూలు చేసింది ఖుషి సినిమా.

Kushi Collections : మూడు రోజుల్లో 70 కోట్లు.. దూసుకుపోతున్న ఖుషి.. విజయ్ సినిమాకు 100 కోట్లు గ్యారెంటీ..

Vijay Devarakonda Samantha Kushi Movie Three Days Collections

Updated On : September 4, 2023 / 12:34 PM IST

Kushi Collections :  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి(Kushi) సినిమా ప్రేక్షకులని మెప్పించి భారీ విజయం సాధించింది. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా హిట్ టాక్ తో దూసుకుపోతూ మంచి కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది.

ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు 15 కోట్ల షేర్ కలెక్షన్స్ మొదటి రోజు వసూలు చేసింది ఖుషి సినిమా. ఇక రెండు రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసిన ఖుషి సినిమా, తాజాగా మూడు రోజుల్లో 70 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు 35 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్టే.

Amardeep Chowdary : బిగ్‌బాస్ సీజన్ 7లో పద్నాల్గవ కంటెస్టెంట్.. అమర్ దీప్.. విదేశాల్లో చదువుకొని ఇక్కడ స్టార్ గా మారి..

ఖుషి సినిమా దాదాపు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 55 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. సినిమా హిట్ టాక్ రావడం, ఈ వారం వేరే సినిమాలేవీ లేకపోవడంతో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని, 100 కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ సమంతలకు ఖుషి సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ తో పాటు విజయ్, సమంత అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.