Vijay Devarakonda To Do A Movie Again With Parasuram Petla
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ నుండి బయటకొచ్చిన విజయ్, ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తన నెక్ట్స్ మూవీపై పెట్టాడు. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో రాబోతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖుషి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ హీరో.
Vijay Devarakonda: యూఎస్ డీల్ క్లోజ్ చేసుకున్న ఖుషి.. టార్గెట్ ఎంతంటే?
ఇక ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. కాగా, ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అటు సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. అయితే విజయ్ దేవరకొండకు గతంలో ‘గీత గోవిందం’ అనే క్లాసిక్ బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ పెట్ల, ఇప్పుడు మరోసారి విజయ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ఇటీవల పరశురామ్ నందమూరి బాలకృష్ణ కోసం ఓ కథను రెడీ చేస్తానని.. ఆయనతో ఖచ్చితంగా ఓ సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Vijay Devarakonda : విజయ్ దేవరకొండకి పెళ్లి అయిపొయింది.. జాన్వీ వ్యాఖ్యలు..
అయితే ఈ సినిమా పట్టాలెక్కాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. ఇంకా నాగచైతన్యతో సినిమా పూర్తి కాలేదు. ఈ క్రమంలో చైతూ సినిమా తరువాత విజయ్ దేవరకొండతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. దీనికి విజయ్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే.. ‘గీత గోవిందం’ కాంబినేషన్‌లో మరో సినిమా రావడం ఖాయమని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.