Kingdom : ఆ సాంగ్ యాడ్ చేసి ‘కింగ్డమ్’ మళ్ళీ రిలీజ్.. ఎప్పట్నించి అంటే..

రిలీజ్ కి ముందు హీరో - హీరోయిన్స్ మీద తెరకెక్కించిన హృదయం లోపల అనే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Kingdom

Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఇటీవల జులై 31న రిలీజయి మంచి టాక్ తో దూసుకుపోతుంది. రెండు రోజుల్లో ఈ సినిమా 53 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే సినిమా చూసిన వారందరికీ ఒకటే కంప్లైంట్ ఉంది. రిలీజ్ కి ముందు హీరో – హీరోయిన్స్ మీద తెరకెక్కించిన హృదయం లోపల అనే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ అందర్నీ మెప్పించింది. హీరో – హీరోయిన్స్ కెమిస్ట్రీ కూడా ఈ సాంగ్ లో బాగుంది.

అయితే సినిమాలో ఈ సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేసారు. దీంతో ఈ సాంగ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ సాంగ్ తీసేయడం వల్ల ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్ చూసి హీరో – హీరోయిన్స్ మధ్య ఇంత కెమిస్ట్రీ ఎప్పుడు డెవలప్ అయిందని ఒక ప్రశ్న మెదులుతుంది. దీంతో అందరూ ఈ సాంగ్ ని ఎందుకు తీసేసారు అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : Pawan Kalyan – Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – పవన్ కళ్యాణ్ ఇష్యూ.. తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. సెకండ్ హాఫ్ లో స్టోరీ వెళ్తుంటే ఆ పాట పెడితే మీరే ఇలాంటి చోట పాట అవసరమా అంటారు. ఇప్పుడు పాట పెట్టలేదని అడుగుతున్నారు. ఆ పాట పెట్టకపోయినా బాగానే వర్కౌట్ అయింది. ఆ పాట ప్లేస్మెంట్ సరిగ్గా సెట్ అవ్వదు అనిపించింది. ఆ సాంగ్ పెట్టకపోయినా ప్రాబ్లమ్ లేదు అనిపించింది. అందుకే పెట్టలేదు. చాలా మంది ఆ సాంగ్ గురించి అడుగుతున్నారు. అందుకే సోమవారం నుంచి ఆ పాటను యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాము అని తెలిపారు.

దీంతో సోమవారం నుంచి కింగ్డమ్ సినిమాలో హృదయం లోపల సాంగ్ ని యాడ్ చేస్తారని తెలుస్తుంది. మరి ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ మళ్ళీ థియేటర్ కి వెళ్తారేమో చూడాలి.

Also Read : Vijay Deverakonda : ఇప్పుడు సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు.. కింగ్డమ్ గురించి విజయ్ మాటలు..

సినిమాలో ఎడిట్ చేసి తీసేసిన సాంగ్ ఇక్కడ వినేయండి..