Pawan Kalyan – Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – పవన్ కళ్యాణ్ ఇష్యూ.. తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
నిర్మాత నాగవంశీ.. విజయ్ దేవరకొండనే మా పవన్ కళ్యాణ్ అని సరదాగా అన్నారు.

Pawan Kalyan - Vijay Deverakonda
Pawan Kalyan – Vijay Deverakonda : ఇటీవల కింగ్డమ్ రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ పవన్ కళ్యాణ్ ని కలిసిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ లో కింగ్డమ్ సినిమా సక్సెస్ ఈవెంట్ ని ఆంధ్రాలో ప్లాన్ చేస్తున్నాం అని నిర్మాత అన్నారు.
దీంతో కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని పిలుస్తారా అని అడగ్గా నిర్మాత నాగవంశీ.. విజయ్ దేవరకొండనే మా పవన్ కళ్యాణ్ అని సరదాగా అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు పవన్ ఫ్యాన్స్, నెటిజన్లు నాగవంశీని విమర్శించారు. విజయ్ దేవరకొండని పవన్ కళ్యాణ్ తో పోలుస్తారా అని పలువురు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఈ విషయం ట్రోల్ అయింది అని ప్రశ్నించగా నాగవంశీ సమాధానమిస్తూ.. కాంట్రవర్సీ చేసే వాళ్ళకు చెప్తున్నా.. మీరు హీరోలా ఉన్నారు, హృతిక్ రోషన్ లా ఉన్నారు అంటాం అది ఆ హీరోని గొప్పగా చేసినట్టు. అలా ఏ హీరోని అయినా తీసుకున్నా మొదట పవన్ కళ్యాణ్ గారినే తీసుకుంటాం కాబట్టి ఈయనే మా సినిమాకు పవన్ కళ్యాణ్ అని అర్ధం వచ్చేలా చెప్పాను. ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పోడు అయ్యాడు, ఈయన పవన్ కళ్యాణ్ ని దాటేశాడు అని చెప్పలేదు. ఒక హీరో గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మన నోట్లో నుంచి వచ్చేది పవన్ కళ్యాణ్ గారి పేరే. అలా మా కళ్యాణ్ ఈయనే అన్నాను. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఎలా. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని ఉదాహరణకు పోల్చి మా సినిమా వరకు ఈయన అలా అని చెప్పాను అంతే అని క్లారిటీ ఇచ్చారు.
NagaVamsi slipper Shot to PK Haters😂🔥
VD Mundu @PawanKalyan ki elevation ichi Controversy ni Clarify cheyadam
@vamsi84 👌pic.twitter.com/hyhBWH4bPi— Pawanism™ (@santhu_msd7) August 2, 2025
Also Read : Rashmika Mandanna : విజయ్ కోసం రష్మిక ఎంత రిస్క్ చేసిందో తెలుసా? మారువేషంలో వెళ్లి మరీ..