Rashmika Mandanna : విజయ్ కోసం రష్మిక ఎంత రిస్క్ చేసిందో తెలుసా? మారువేషంలో వెళ్లి మరీ..
తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.

Rashmika Mandanna
Rashmika Mandanna : విజయ్ – రష్మిక ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా కలిసి పార్టీలు చేసుకుంటున్నారు, వెకేషన్స్ కి వెళ్తున్నారు. కానీ అధికారికంగా ఏమి చెప్పట్లేదు. ఇక ఎవరి సినిమా రిలీజ్ అయినా, సినిమాకు సంబంధించి ఏం వచ్చినా ఇంకొకరు ప్రేమగా ట్వీట్స్ వేస్తారు.
విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ సినిమాతో వచ్చి సక్సెస్ సాధించాడు. కింగ్డమ్ రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత రష్మిక ఈ సినిమా గురించి స్పెషల్ ట్వీట్స్ వేసింది. తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
నాగవంశీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మిక విజయ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆమె శ్రీరాములు థియేటర్ కి సినిమా చూద్దామని వెల్దామనుకున్నారు. కానీ పోలీస్ పర్మిషన్ లేక వెళ్లడం కుదరలేదు. దాంతో ఆమె భ్రమరాంబ థియేటర్ కి ఒక మాములు మనిషిలా మారు వేషంలో వెళ్లి సినిమా చూసారు అని తెలిపారు.
దీంతో రష్మిక చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. రష్మిక విజయ్ సినిమా చూడటం కోసం పెద్ద సాహసమే చేసింది, ఎవరైనా గుర్తుపడితే అంతే సంగతి, ఫొటోలు అని అందరూ గుమిగూడేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు విజయ్ – రష్మిక ఫ్యాన్స్. మొత్తానికి విజయ్ సినిమా కోసం రష్మిక సీక్రెట్ గా రిస్క్ చేసి మరీ వెళ్లడంతో మరోసారి వీరి రిలేషన్ గురించి చర్చగా మారింది.
మారు వేషం లో భ్రమరాంబ థియేటర్ లో సినిమా చూసిన రష్మిక
అసలు సీక్రెట్ బయట పెట్టిన నాగవంశీ#RashmikaMandanna #NagaVamsi pic.twitter.com/4LF9TX4Mbu
— Telugu360 (@Telugu360) August 2, 2025
Also Read : Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ సాంగ్ రిలీజ్.. పవర్ స్టార్ లుక్స్ అదిరిపోయాయిగా.. ఫొటోలు..