Kingdom : కింగ్డమ్ 2 కాదు ఏకంగా 3 పార్టులు.. కింగ్డమ్ 3 కథ ఇదే.. ఎన్టీఆర్ టైటిల్ తో.. లీక్ చేసేసిన విజయ్ దేవరకొండ..

ఈ సినిమాకు ముందే రెండు పార్టులు ప్రకటించారు.

Kingdom : కింగ్డమ్ 2 కాదు ఏకంగా 3 పార్టులు.. కింగ్డమ్ 3 కథ ఇదే.. ఎన్టీఆర్ టైటిల్ తో.. లీక్ చేసేసిన విజయ్ దేవరకొండ..

Kingdom

Updated On : August 2, 2025 / 3:16 PM IST

Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా థియేటర్స్ లో సూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే 53 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమాకు ముందే రెండు పార్టులు ప్రకటించారు. సినిమాలో కూడా పార్ట్ 2కి కావాల్సిన లీడ్స్ ఇచ్చి వదిలేసారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కూడా.. కింగ్డమ్ పార్ట్ 2 ఉంటుంది. విజయ్ కి ఉన్న కమిట్మెంట్స్ అయ్యాక పార్ట్ 2 ఉంటుంది. ఈ సినిమాలో సేతు పాత్ర ఓ పెద్ద హీరో చేస్తున్నాడు. హీరోయిన్ కి సెకండ్ పార్ట్ లో ఎక్కువ లెంగ్త్ ఉంటుంది. సెకండ్ పార్ట్ లో హీరో – హీరోయిన్ కి మధ్య వార్ ఉంటుంది అని తెలిపాడు.

దీంతో కింగ్డమ్ పార్ట్ 2 కూడా ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. తాజాగా నేడు విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ.. కింగ్డమ్ పార్ట్ 3 కూడా ఉంటుంది. ఇది సీక్వెల్ కాదు. మొదటి పార్ట్ కి ప్రీక్వెల్. కింగ్డమ్ లో 1920లో తెగ, రాజు గురించి జస్ట్ కొంచెమే చూపించాము. అసలు ఆ తెగ ఏంటి, ఆ రాజు ఎవరు, ఆ రాజు ఎలా ఎదిగాడు అనేది పార్ట్ 3లో ఉంటుంది. ఈ సినిమాకు దేవర నాయక అనే టైటిల్ ముందు అనుకున్నాము. కానీ ఎన్టీఆర్ అన్న దేవర వచ్చాక టైటిల్ మారుద్దాం అనుకున్నాము అని తెలిపారు.

Also See : Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ సాంగ్ రిలీజ్.. పవర్ స్టార్ లుక్స్ అదిరిపోయాయిగా.. ఫొటోలు..

దీంతో కింగ్డమ్ సినిమాకు మరో రెండు పార్ట్ లు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కింగ్డమ్ పార్ట్ 2లో .. అక్కడి తెగకు రాజుగా మారిన హీరో ఇండియా నుంచి వచ్చిన స్పై అని వాళ్లకు తెలుస్తుందా? హీరోయిన్ కి ఓ విషయం తెలిసి హీరోకి చెప్పకుండా ఉండటం వల్ల ఆమె మీద పగ తీర్చుకోడానికి వస్తాడా? హీరోని ఎదిరించడానికి సేతు అనే ఓ కొత్త విలన్ రావడం.. కథాంశంతో పార్ట్ 2 ఉంటుందని తెలుస్తుంది.

ఇక పార్ట్ 3లో 1920 లో ఉన్న తెగ, రాజు గురించి కథ ఉండబోతుందని తెలుస్తుంది. మరి కింగ్డమ్ మిగిలిన రెండు పార్టులు ఎప్పుడు తీస్తారో చూడాలి.

Also Read : They Call Him OG : పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. తమన్ అదరగొట్టాడుగా..