Vijay Deverakonda : ఇప్పుడు సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు.. కింగ్డమ్ గురించి విజయ్ మాటలు..
కింగ్డమ్ సక్సెస్ పై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

Vijay Deverakonda
Vijay Deverakonda : గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్డమ్ సినిమా ఇటీవల జూలై 31న రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా అదిరిపోయే విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ నేడు మీడియాతో మాట్లాడాడు.
కింగ్డమ్ సక్సెస్ పై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో మంచి స్పందన వస్తుంది. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా అక్కడి ప్రేక్షకులు కూడా ప్రేమను చూపించడం ఆనందంగా ఉంది. కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఉంటుంది. సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. మొదటి షో పూర్తయ్యి పాజిటివ్ టాక్ వచ్చిందో అప్పుడు చాలా సంతోషం కలిగింది అని తెలిపారు.
Also Read : Rashmika Mandanna : విజయ్ కోసం రష్మిక ఎంత రిస్క్ చేసిందో తెలుసా? మారువేషంలో వెళ్లి మరీ..
డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గురించి మాట్లాడుతూ.. గౌతమ్ కుటుంబ బంధాలను, ఎమోషన్స్ ని డీల్ చేసే విధానం నాకు ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా గౌతమ్ చెప్పినప్పుడు నాకు ఆసక్తికరంగా అనిపించింది. గౌతమ్ కి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతిదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్‌డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు అని తెలిపాడు.
కింగ్డమ్ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం, దేశభక్తి, ఒక తెగకు చెందిన నాయకుడు.. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని అనుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. దేనికి మూడో భాగం ప్రీక్వెల్ కూడా అనుకున్నాము. అది 1920 ఎపిసోడ్ లో రాజు కథ ఉండొచ్చు అని అన్నారు.
కింగ్డమ్ సినిమాలో ఆయుధాలతో ఓటింగ్ వేసే సన్నివేశాల గురించి విజయ్ మాట్లాడుతూ.. గౌతమ్ కథ చెప్పినప్పుడు ఓటింగ్ వేసే సన్నివేశాల గురించి చెప్పాడు కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు. షూట్ కి రెండు రోజుల ముందు ఇలా గన్ లు, కత్తుల వంటి ఆయుధాలతో ఓటింగ్ ఉంటుంది చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. అది ప్రేక్షకులకు నచ్చింది అని తెలిపారు.
కింగ్‌డమ్ కోసం విజయ్ చేసిన హోం వర్క్ గురించి చెప్తూ.. ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు వేసుకునేవారు అని తెలుసుకున్నాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లు చూశాను. లుక్ పరంగా మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. నేను ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను. దాదాపు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను ఈ సినిమాకు ఫిట్ గా కనిపించడానికి అని చెప్పారు.
తన నెక్స్ట్ సినిమాల గురించి చెప్తూ.. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాను. మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్నాను. నాకు సీమ యాస అంటే ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఆంధ్రా నేపథ్యంలో చేస్తున్నాను. సుకుమార్ గారితో కూడా సినిమా ఉంటుంది అని విజయ్ తెలిపాడు.