Ranabaali : విజయ్ బర్త్ డే స్పెషల్.. ‘రణబాలి’ మేకింగ్ వీడియో రిలీజ్.. గుర్రంపై నుంచి పడ్డ విజయ్ దేవరకొండ..
నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. (Ranabaali)
Vijay
Ranabaali : విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు నెలకొల్పారు.
నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ రణబాలి సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడం, హార్స్ రైడింగ్ చేస్తుంటే పడిపోవడం, గుర్రాన్ని పర్ఫెక్ట్ గా స్వారీ చేయడం చూపించారు. ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడుతున్నట్టు, ఈ గుర్రపు స్వారీ కోసం చాలా కష్టపడుతున్నట్టు ఈ వీడియోలో చూపించారు.
దీంతో విజయ్ ఫ్యాన్స్ ఈ కష్టాన్ని అభినందిస్తున్నారు. ఆల్రెడీ గ్లింప్స్ లోనే విజయ్ గుర్రపు స్వారీ సీన్ ఉంది కాబట్టి సినిమాలో విజయ్ గుర్రంపై పవర్ ఫుల్ గా స్వారీ చేసుకుంటూ వచ్చే సీన్స్ చాలానే ఉండబోతున్నాయని తెలుస్తుంది. మీరు కూడా విజయ్ గుర్రపు స్వారీ వీడియో చూసేయండి..
