ఆ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ రౌడీనే..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అకౌంట్‌లో రేర్ రికార్డ్..

  • Published By: sekhar ,Published On : February 25, 2020 / 10:02 AM IST
ఆ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ రౌడీనే..

Updated On : February 25, 2020 / 10:02 AM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అకౌంట్‌లో రేర్ రికార్డ్..

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సాధించాడు. మనోడి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య మరో మైలురాయిని తాకింది. విజయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా ఆరు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ విజయే కావడం విశేషం.

ఈ విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబులను దాటేశాడు విజయ్. ఇటీవలే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ రౌడీ బోయ్. విజయ్ నటనకు మంచి స్పందన లభించింది కానీ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు.

ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఫైటర్’ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

Vijay Deverakonda