పిల్లల ప్రేమలో విజయ్ దేవరకొండ

చిన్నారులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.

  • Publish Date - February 8, 2019 / 12:52 PM IST

చిన్నారులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రీసెంట్‌గా, 2019 ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ లో ప్లేస్ పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. నా ఆంధ్రాబ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.500లు మెయిన్‌టెన్ చెయ్యలేదని నా అకౌంట్  లాక్ చేసారు.. అంటూ, విజయ్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఇప్పుడు విజయ్ చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొన్నామధ్య, డియర్ కామ్రేడ్ షూటింగ్‌లో విజయ్ చేతికి దెబ్బ తగిలింది. విజయ్ షేర్ చేసిన ఆ పిక్ చూసి ఇద్దరు పిల్లలు, విజయ్ కొండకు ఏమైంది? అని జాలిపడుతూ, డాక్టర్ దగ్గరికెళ్ళు అని సలహా కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులతో తీసిన వీడియోను నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, విజయ్‌ని ట్యాగ్ చేసాడు. మీకు తగిలిన దెబ్బలు చూసి, మా కిడ్స్ బాధ పడుతున్నారు అని ట్వీట్ చెయ్యగా, విజయ్ రిప్లై ఇచ్చాడు.

వీళ్ళతో నేను లవ్‌లో పడ్డాను.. విజయ్ దేవరకొండకు డాక్టర్ అవసరం లేదు.. కానీ, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీకు కుదురుతుందా? అని అడిగాడు. పిల్లల ఫాదర్ ఆశ్చర్యపోతూ.. ఖచ్చితంగా, మిమ్మల్ని కలిస్తే మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీలవుతారు. మేం అమెరికాలోని ఫిలడెల్ఫియా నుండి శనివారం హైదరాబాద్ వస్తున్నాం అని చెప్పగా.. విజయ్ టీమ్, అతని మొబైల్ నంబర్ తీసుకున్నారు. సదరు నెటిజన్… నేను నమ్మలేకపోతున్నాను, ఈ ట్రిప్ మరింత గుర్తుండిపోయేలా మారనుంది అని రిప్లై ఇచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.