Kingdom : అఫీషియ‌ల్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కింగ్‌డ‌మ్’ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం కింగ్ డ‌మ్‌ విడుద‌ల వాయిదా ప‌డింది.

Vijay Deverakonda kingdom movie postponed to july

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం కింగ్ డ‌మ్‌. తాజాగా ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది. కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని జూలై 4న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. వాస్త‌వానికి ఈ చిత్రం మొద‌ట‌గా మే 30న విడుద‌ల కావాల్సి ఉంది.

“మే 30న విడుదల కావాల్సిన మా ‘కింగ్‌డమ్‌’ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్‌లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Ram Charan : గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చరణ్‌పై డాక్యుమెంటరీ?

ఈ నిర్ణయం ‘కింగ్‌డమ్’కి మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చినా ‘కింగ్‌డమ్‌’ చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. జూలై 4న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ చిత్రం, మీ ప్రేమను పొందుతుందని ఆశిస్తున్నాము.” అని చిత్ర‌బృందం తెలిపింది.

Balakrishna : వామ్మో బాల‌య్య‌కు అన్ని కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారా? ర‌జ‌నీకాంత్ మూవీలో..

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే క‌థానాయిక‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు