Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌పై డాక్యుమెంటరీ?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌పై ఓ డ్యాకుమెంటరీ తీయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Netflix planning a documentary on Ramcharan report
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌పై ఓ డ్యాకుమెంటరీ తీయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇందుకు సంబంధించిన సన్నాహకాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మగధీర చిత్రంతో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్.. చరణ్ జీవితం పై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
Anchor Suma : అప్పట్లోనే సుమకు రైల్వేస్ నేషనల్ అవార్డు.. ఎందులోనో తెలుసా?
ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టిందట. ఈ డాక్యుమెంటరీలో చరణ్ కెరీర్, ఫ్యాన్స్‌తో ఉన్న అనుబంధం, సాధించిన అవార్డులు ఇలా ఇంకెన్నో విషయాలను చూపించబోతున్నారట. త్వరలోనే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని టాక్.
దర్శకదీరుడు రాజమౌళి, లేడి సూపర్ స్టార్ నయనతార లపై ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ డాక్యుమెంటరీలను రూపొందించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రామ్‌చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది.