Anchor Suma : అప్పట్లోనే సుమకు రైల్వేస్ నేషనల్ అవార్డు.. ఎందులోనో తెలుసా?

తాజాగా ఈ చాట్ షోలో సుమ ఓ ఆసక్తికర విషయం తెలిపింది.

Anchor Suma : అప్పట్లోనే సుమకు రైల్వేస్ నేషనల్ అవార్డు.. ఎందులోనో తెలుసా?

Do You Know Anchor Suma gets National Award as Theater Artist

Updated On : May 13, 2025 / 7:46 PM IST

Anchor Suma : యాంకర్ సుమ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా మెప్పిస్తుంది. అనేక టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో మెప్పించిన సుమ ప్రస్తుతం టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో పాటు తన యూట్యూబ్ ఛానల్ లో చాట్ షో అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాం కూడా చేస్తుంది.

తాజాగా ఈ చాట్ షోలో సుమ ఓ ఆసక్తికర విషయం తెలిపింది.

Also Read : Anchor Suma : వోకల్ కార్డ్స్ లో సమస్య.. పది రోజులు మాట్లాడకుండా.. ఆ సమస్య ఫేస్ చేసిన యాంకర్ సుమ..

యాంకర్ సుమ మాట్లాడుతూ.. నేను కూడా థియేటర్ ఆర్టిస్ట్ నే. చాలా నాటకాలు వేశాను. కొడుకు పుట్టాలి అనే తెలుగు నాటకం హిందీలో చేశాను. ఆల్ ఇండియా రైల్వేస్ లో చాలా ప్లేసెస్ లో ఆ నాటకం పర్ఫార్మ్ చేశాను. ఖరగ్ పూర్, ఢిల్లీ.. అలా చాలా ప్లేసెస్ లో తిరిగి నాటకాలు వేశాను. అప్పట్లోనే రైల్వేస్ లో నాటకాలలో బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్నాను. సంఘం మారాలి, రేపటి మహిళ, స్వామి వివేకానంద.. ఇలా చాలా నాటకాలు వేశాను అని తెలిపింది.

యాంకర్ సుమ వాళ్ళ నాన్న రైల్వే ఎంప్లాయి. ఉద్యోగం కోసం కేరళ నుంచి సికింద్రాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ రైల్వే క్వార్ట్రర్స్ లోనే సుమ పెరిగింది. అలా రైల్వేలో జరిగే అనేక ప్రోగ్రామ్స్ లో పాల్గొంది సుమ. ఆ క్రమంలోనే సుమ థియేటర్ ఆర్టిస్ట్ గా రైల్వేస్ లో నాటకాలు కూడా వేసింది.

Also Read : Bellamkonda Sreenivas : రాంగ్ రూట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్.. కానిస్టేబుల్ ప్రశ్నించడంతో..