Anchor Suma : వోకల్ కార్డ్స్ లో సమస్య.. పది రోజులు మాట్లాడకుండా.. ఆ సమస్య ఫేస్ చేసిన యాంకర్ సుమ..
తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూలో సుమ గతంలో తన వాయిస్ కి ఎఫెక్ట్ అయిన ఓ సంగతి చెప్పుకొచ్చింది.

Anchor Suma Effected with Vocal Nodules Issue
Anchor Suma : యాంకర్ సుమ అంటే తెలుగువారందరికీ సుపరిచితమే. టీవీ షోలతో తెలుగు ప్రజలకు, ఫ్యామిలీలకు బాగా దగ్గరైంది. ఇక సినిమా ఈవెంట్స్ తో యూత్ ని కూడా అలరిస్తుంది. ప్రస్తుతం యాంకర్ సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, తన యూట్యూబ్ ఛానల్ తో బిజీగానే ఉంది. సుమ తన యూట్యూబ్ ఛానల్ లో చాట్ షో అనే ఓ ఇంటర్వ్యూ ప్రోగ్రాం చేస్తుంది.
తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూలో సుమ గతంలో తన వాయిస్ కి ఎఫెక్ట్ అయిన ఓ సంగతి చెప్పుకొచ్చింది.
Also Read : Santhanam : గోవింద నామాలతో పేరడీ సాంగ్ చేసిన తమిళ్ కమెడియన్.. భక్తులు ఫైర్.. జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు..
సుమ మాట్లాడుతూ.. నాకు వోకల్ నాడ్యూల్స్ వచ్చినపుడు డాక్టర్స్ నా వాయిస్ కి రెస్ట్ ఇవ్వమన్నారు. దాంతో పది రోజులు నేను మౌన వ్రతం చేశాను. నా వోకల్ కార్డ్స్ లో స్మాల్ బంప్స్ లాంటివి వచ్చాయి, దాంతో డాక్టర్ అస్సలు మాట్లాడొద్దు అన్నారు. పది రోజులు మాట్లాడకుండా ఉన్నాను అని తెలిపింది.
వోకల్ నాడ్యూల్స్ అంటే గొంతులో మాట్లాడటానికి ఉండే నరాలకు కలిగే సమస్య. ఎక్కువగా మాట్లాడటం, అరవడం లాంటివి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. సుమ రోజూ షోలలో ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటుంది కాబట్టి ఈ సమస్య వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకోవడం, మాట్లాడకుండా ఉండటం వల్ల సుమ ఈ సమస్య నుంచి బయటపడిందని చెప్పింది.