Charmme Kaur : ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..!

తన కొత్త సినిమా కోసం థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు ఓ యంగ్ హీరో.. ఇప్పుడీ మూవీ షూటింగ్ పున:ప్రారంభమైంది..

Charmme Kaur : ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..!

Liger

Updated On : September 15, 2021 / 2:12 PM IST

Charmme Kaur: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’.. ‘సాలా క్రాస్ బీడ్’ అనేది ట్యాగ్ లైన్.. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్.. పాండమిక్ తర్వాత ‘లైగర్’ షూటింగ్ పున:ప్రారంభమైంది.

Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఆన్ లొకేషన్ పిక్ షేర్ చేశారు ఛార్మీ. బోనులో పులిలా బాక్సింగ్ రింగ్‌లో కూర్చుని ఉన్న ‘లైగర్’ విజయ్ దేవరకొండని వెనుక నుంచి చూపించారు. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చెయ్యనున్నామని తెలిపారు.

Directors Meeting : దర్శకులంతా ఒకే చోట చేరారు.. ఏం డిస్కస్ చేస్తున్నారబ్బా..!

బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రౌడీ స్టార్ థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. సాధారణంగా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసి పూరి.. ‘లైగర్’ కోసం దాదాపు రెండేళ్లకు పైగా టైం తీసుకున్నారు.