బన్నీతో పాటు అతడి పిల్లలకు గిఫ్టులు పంపిన విజయ్ దేవరకొండ.. ఏం గిఫ్టులంటే..?
ఈ గిఫ్టులకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు.

సినీనటుడు అల్లు అర్జున్‌కు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ బహుమతి పంపాడు. విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లో తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కి తన బ్రాండ్ దుస్తులతో పాటు ఆయన పిల్లల కోసం బర్గర్‌లు పంపాడు.
ఈ గిఫ్టులకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ ఎల్లప్పుడూ సర్‌ప్రైజ్ ఇస్తుంటాడని చెప్పాడు. అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ ఇలా బహుమతులు పంపడం ఇది కొత్తేం కాదు. గతంలోనూ పలుసార్లు గిఫ్ట్‌లు పంపాడు.
పుష్ప 2 సినిమా విడుదల వేళ కూడా ఆ సినిమా పేరుతో ఉన్న టీ షర్ట్‌లను పంపాడు. అప్పట్లోనూ ఇందుకు సంబంధించిన ఫొటోను బన్నీ పోస్ట్ చేశాడు. కాగా, అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అనంతరం బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్ సినిమాలో నటిస్తున్నాడు.