మరో బిజినెస్ లోకి విజయ్ దేవరకొండా

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే కుర్రాల్ల మనసులు దోచుకున్నాడు. దేవరకొండా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రౌడీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇంతకు విజయ్ స్టార్ట్ చేయనున్న వ్యాపారమేంటో తెలుసా? మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్.
ఏషియన్ సినిమాస్ తో కలిసి తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో AVD( ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ లాంచ్ చేస్తున్నాడట.. ఇప్పటికే కన్‌స్ట్రక్షన్ మొదలు కాగా, సమ్మర్ లోగా థియేటర్ ని పూర్తి చేస్తారట.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించనున్నాడు. విజయ్ కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను (జనవరి 3, 2020)న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.