HMD Vibe 5G Smartphone : కొత్త HMD వైబ్ 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. జస్ట్ ధర రూ. 10వేల లోపే.. రెండు 4G ఫీచర్ ఫోన్లు కూడా..!

HMD Vibe 5G Smartphone : HMD వైబ్ 5G స్మార్ట్‌ఫోన్, మరో రెండు HMD 101 4G, HMD 102 4G ఫోన్ మోడల్స్ కూడా లాంచ్ అయ్యాయి.

HMD Vibe 5G Smartphone : కొత్త HMD వైబ్ 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. జస్ట్ ధర రూ. 10వేల లోపే.. రెండు 4G ఫీచర్ ఫోన్లు కూడా..!

HMD Vibe 5G Smartphone

Updated On : September 12, 2025 / 5:44 PM IST

HMD Vibe 5G Smartphone : HMD ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. HMD Vibe 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెండు 4G ఫీచర్ ఫోన్లను ప్రవేశపెట్టింది. అందులో HMD 101 4G, HMD 102 4G ఫోన్ మోడల్స్ ఉన్నాయి.

ఈ హెచ్ఎండీ వైబ్ 5G స్మార్ట్‌ఫోన్ రూ. 10వేల కన్నా తక్కువ ధరలో కంపెనీ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్. 50MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. హెచ్ఎండీ 101 4G, హెచ్ఎండీ 102 4G రెండూ 1,000mAh బ్యాటరీ, కలర్ మ్యాచ్‌డ్ కీప్యాడ్‌లతో వస్తాయి. హెచ్ఎండీ 102 4Gలో ఫ్లాష్‌తో QVGA కెమెరా కూడా ఉంది.

హెచ్ఎండీ వైబ్ 5G, 101 4G, 102 4G భారత్ ధర, లభ్యత :
హెచ్ఎండీ వైబ్ 5G : లాంచ్ ధర రూ. 11,999, రూ. 8,999 స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్, బ్లాక్, పర్పల్ కలర్ ఆప్షన్లు, వన్ ఇయర్ రిప్లేస్‌మెంట్ గ్యారెంటీ

  • హెచ్ఎండీ 101 4G : ధర రూ. 1,899, బ్లూ, డార్క్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లు
  • హెచ్ఎండీ 102 4G : ధర రూ. 2,199, బ్రైట్ బ్లూ, పర్పల్, రెడ్ కలర్ ఆప్షన్లు
  • భారత మార్కెట్లో ఈ రెండు ఫోన్లు HMD ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

HMD వైబ్ 5G స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.67-అంగుళాల HD+ LCD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్ : ఆక్టా-కోర్ 6nm యూనిసాక్ T760 చిప్‌సెట్
ర్యామ్ : 4GB LPDDR 4X
స్టోరేజీ : 128GB (మైక్రో SDతో 256GB వరకు విస్తరణ)
ఆపరేటింగ్ సిస్టమ్ : స్టాక్ ఆండ్రాయిడ్ 15 (రెండు ఏళ్ల త్రైమాసిక సెక్యూరిటీ అప్‌డేట్స్)
రేర్ కెమెరా : 50MP ప్రైమరీ సెన్సార్ + 2MP డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్
ఫ్రంట్ కెమెరా : 8MP సెన్సార్
బ్యాటరీ : 5,000mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్ (ఛార్జర్)
కనెక్టివిటీ : 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, GLONASS, USB టైప్-C
ఆడియో : 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, డెడికేటెడ్ నోటిఫికేషన్ లైట్
సెక్యూరిటీ : సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
డైమెన్షన్ : 165 × 75.8 × 8.65మి.మీ, 190గ్రాములు
ఇతరులు : ఇన్-బాక్స్ కేసు, వన్ ఇయర్ రిప్లేస్‌మెంట్ గ్యారెంటీ

Read Also : iPhone Users : ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరిక.. ఈ కొత్త స్పైవేర్ దాడులపై మీకు నోటిఫికేషన్ వచ్చిందా? అర్జంట్ గా ఇలా చేయండి!

HMD 101 4G, 102 4G స్పెసిఫికేషన్లు :

డిస్‌ప్లే : 2-అంగుళాల QQVGA (240 × 320 పిక్సెల్స్)
ప్రాసెసర్ : యూనిసోక్ 8910 FF-S చిప్‌సెట్
స్టోరేజీ : 16MB (మైక్రో SDతో 32GB వరకు)
ఆపరేటింగ్ సిస్టమ్ : S30+ RTOS
బ్యాక్ కెమెరా : HMD 102 4G ఓన్లీ, ఫ్లాష్‌తో QVGA కెమెరా
బ్యాటరీ : 1,000mAh రిమూవబుల్ బ్యాటరీ
కనెక్టివిటీ : డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0, USB టైప్-C
ఆడియో : 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్ఎం రేడియో, MP3 ప్లేయర్
డ్యూరబిలిటీ : డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు IP52 రేటింగ్