iPhone Users : ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరిక.. ఈ కొత్త స్పైవేర్ దాడులపై మీకు నోటిఫికేషన్ వచ్చిందా? అర్జంట్ గా ఇలా చేయండి!
iPhone Users : ఈ స్పైవేర్ దాడులు జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్యకర్తలు, రాజకీయ నేతలు, సీనియర్ అధికారులే లక్ష్యమని ఆపిల్ హెచ్చరించింది.

iPhone Users
iPhone Users : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఐఫోన్ భద్రమేనా? మీ వ్యక్తిగత డేటా డేంజర్‌లో ఉందని తెలుసా? ఇటీవలు స్పైవేర్ దాడులు ఎక్కువగా ఐఫోన్ డివైజ్‌లే లక్షంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌లోని ఐఫోన్ యూజర్లను లక్ష్యంగా డేంజరస్ స్పైవేర్ దాడులపై ఆపిల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాదిలో ఆపిల్ సెక్యూరిటీ (iPhone Users) వార్నింగ్స్ పంపినట్లు ఫ్రాన్స్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ (CERT-FR) ధృవీకరించింది.
ఇదే విషయాన్ని బ్లీపింగ్ కంప్యూటర్ కూడా నివేదించింది. CERT-FR ప్రకారం.. ఆపిల్ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐఫోన్ యూజర్లకు కనీసం 4 స్పైవేర్ సంబంధిత నోటిఫికేషన్‌లను పంపింది. ఈ అలర్ట్స్ ప్రధానంగా మార్చి 5, ఏప్రిల్ 29, జూన్ 25, సెప్టెంబర్ 11, 2025న అందాయి.
ఆపిల్ స్పైవేర్ అలర్ట్.. ఎవరికి రిస్క్ ఉందంటే? :
ఈ వార్నింగ్ అలర్ట్స్ పొందే యూజర్లు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రస్ ద్వారా నోటిఫికేషన్ పొందుతారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఇలాంటి స్పైవేర్ దాడులకు సంబంధించి కంపెనీ ఐఫోన్ యూజర్లను హెచ్చరిస్తోంది. ఆపిల్ నోటిఫికేషన్లపై CERT-FR కూడా హెచ్చరిస్తోంది. ఈ స్పైవేర్ దాడులు సాధారణ హ్యాక్‌లు కావని, ఇందులో ఎక్కువ భాగం జీరో-డే లేదా జీరో-క్లిక్ మెథడ్స్ ఉపయోగిస్తాయని సీఈఆర్టీ-ఎఫ్ఆర్ వివరించింది.
అంటే.. ఎవరైనా ఒక బాధితుడు ఏదైనా క్లిక్ చేయాల్సిన లేదా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్యకర్తలు, రాజకీయ నేతలు, సీనియర్ అధికారులు వంటి ఉన్నత స్థాయి వ్యక్తులే ఈ దాడులకు లక్ష్యంగా మారుతున్నారు.
ఐక్లౌడ్ ఖాతాకు లింక్ చేసిన డివైజ్‌లే టార్గెట్.. :
ఈ సైబర్ దాడులు ఎక్కువగా వ్యక్తులు లేదా హోదాపరంగా జరుగుతున్నాయి. జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, వ్యూహాత్మక రంగాలలోని నిర్వహణ కమిటీల సభ్యులు మొదలైన వారికి ఆపిల్ ప్రత్యేకించి వార్నింగ్ అలర్ట్స్ పంపుతోంది. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఐక్లౌడ్ ఖాతాకు లింక్ చేసిన డివైజ్‌లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని సైబర్ భద్రతా సంస్థ తెలిపింది.
ఆపిల్ ఇటీవలే వాట్సాప్ జీరో-క్లిక్ (CVE-2025-55177)కి సంబంధించిన జీరో-డే లోపాన్ని (CVE-2025-43300) పరిష్కరించేందుకు ఎమర్జెన్సీ సెక్యూరిటీ అప్ డేట్స్ రిలీజ్ చేసింది. వాట్సాప్ ఇదివరకే ఐఫోన్ యూజర్లను ఫ్యాక్టరీ సెట్టింగ్ రీసెట్ చేయాలని యాప్‌లను అప్‌డేట్ చేయాలని సూచించింది.
ఆపిల్ కూడా స్పైవేర్ అలర్ట్స్ అందుకున్న ఎవరైనా లాక్‌డౌన్ మోడ్‌ను ఎనేబుల్ చేయాలని, యాక్సెస్ నౌ డిజిటల్ సెక్యూరిటీ హెల్ప్‌లైన్ వంటి నిపుణుల నుంచి సాయం తీసుకోవాల్సిందిగా కోరింది.
ఆపిల్ 2021 నుంచే సెక్యూరిటీ నోటిఫికేషన్‌లను పంపుతోంది. 150 కన్నా ఎక్కువ దేశాలలో ఐఫోన్ యూజర్లను హెచ్చరిస్తోంది. స్పైవేర్ దాడులతో ప్రతి ఒక్కరూ అప్‌డేట్‌గా ఉండటంతో పాటు తమ ఫోన్లను ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంతైనా అవసరం.