Fitness Test Fee : రూ.25,000 చార్జీ.. ఈ వాహనదారులకు కేంద్రం షాక్..!

Fitness Test Fee : 20 ఏళ్లు పైబడిన ప్రైవేట్ వాహనాలకు రూ.2000 ఫిట్‌నెస్ పరీక్ష రుసుమును మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

Fitness Test Fee : రూ.25,000 చార్జీ.. ఈ వాహనదారులకు కేంద్రం షాక్..!

Fitness Test Fee

Updated On : September 12, 2025 / 6:20 PM IST

Fitness Test Fee : వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. మీ పాత వాహనాలకు కాలం చెల్లినట్టే.. రోడ్డుపైకి వస్తే బాదుడే బాదుడు.. ఇకపై 20ఏళ్లు పైబడిన ప్రైవేటు వాహనాలు రోడ్లపైకి వస్తే భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్ నెస్ పరీక్ష ఫీజు కింద ఏకంగా రూ. 25వేల వరకు ఖర్చువుతుంది. కేంద్ర ప్రభుత్వం పాత, కాలుష్య కారక వాహనాలను తొలగింపు లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగానే పాత వాహనాల (Fitness Test Fee) ఫిట్‌నెస్ పరీక్ష ఫీజులను భారీగా పెంచాలని ప్రతిపాదించింది. పాత వాహనాలను వదిలించుకుని కొత్త వాహనాలను తీసుకునేలా వాహనదారులను ప్రోత్సహించడమే ఉద్దేశ్యం. నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుమును పెంచిన కొన్ని వారాలకే ఈ కొత్త ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది.

ఫిట్‌నెస్ పరీక్ష ఫీజు ఎంత పెరగవచ్చు? :
20 ఏళ్లు పైబడిన ప్రైవేట్ వాహనాల ఫిట్‌నెస్ పరీక్ష రుసుమును భారీగా పెంచాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. 15 ఏళ్లు పైబడిన మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలకు అధికంగా పెంచాలని ప్రతిపాదించింది. 20 ఏళ్ల కార్ల యజమానులు ఈ పరీక్ష కోసం రూ. 2వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ట్రక్కులు, బస్సులకు మాత్రం ఏకంగా రూ. 25,000 ఖర్చవుతుంది.

ప్రైవేట్ వాహనాలకు 15 ఏళ్లు నిండిన తర్వాత సరైన ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఆర్టీఓలు, ప్రైవేట్ వాహనాలను పరీక్షల ద్వారా కాకుండా వాటి కండిషన్ పరిశీలించడం ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. ఈ వ్యవస్థను మార్చాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Read Also : HMD Vibe 5G Smartphone : కొత్త HMD వైబ్ 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. జస్ట్ ధర రూ. 10వేల లోపే.. రెండు 4G ఫీచర్ ఫోన్లు కూడా..!

ఫిట్‌నెస్ పరీక్ష ప్రక్రియలో మార్పు :
మాండేటరీ ఆటోమేటెడ్ టెక్నికల్ టెస్టులను కార్లతో ప్రారంభించి దశలవారీగా అమలు చేయాలా వద్దా అనేది కూడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని వర్గాలు తెలిపాయి. మంత్రిత్వ శాఖ ముసాయిదా నిబంధన ప్రకారం.. 10, 13, 15, 20 ఏళ్ల కన్నా ఎక్కువ నడిచిన వాణిజ్య వాహనాలకు ప్రత్యేక రుసుము స్లాబ్‌లుగా విభజించనున్నారు. ప్రస్తుతం, 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వాణిజ్య వాహనాలకు కూడా అదే ఫీజులు వర్తిస్తాయి.

ప్రస్తుత నియమాలేంటి? :

20 ఏళ్లు పైబడిన వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ కోసం పరీక్ష రుసుమును రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది. వాణిజ్య వాహనాలకు, మొదటి 8 ఏళ్లకు ప్రతి 2 ఏళ్లకు ఆ తర్వాత ప్రతి ఏడాది ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరి. అదేవిధంగా, ప్రైవేట్ వాహనాలకు, 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత (రిజిస్ట్రేషన్ రెన్యువల్) ఫస్ట్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు.

“ఈ విధానాన్ని మార్చాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రైవేట్ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షను 10 ఏళ్ల తర్వాత కూడా తప్పనిసరి చేయాలి. అది ప్రైవేట్ లేదా వాణిజ్య వాహనం అయినా, ఫిట్‌నెస్ ప్రాధాన్యతగా ఉండాలి. ఏదైనా పనికిరాని వాహనం అన్ని రోడ్డు వినియోగదారులకు ప్రమాదకరం” అని ఢిల్లీ మాజీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ అనిల్ చికారా పేర్కొన్నారు.