IND vs AUS : సెప్టెంబర్ 14 నుంచి భారత్, ఆసీస్‌ల మధ్య వన్డే సిరీస్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఆస్ట్రేలియా, భారత మహిళల జట్ల (IND vs AUS) మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.

IND vs AUS Women ODI series Schedule live streaming details
IND vs AUS : ఆస్ట్రేలియా, భారత మహిళల జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 14 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌లు న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో జరగనున్నాయి. మూడో వన్డేకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే క్రికెట్‌లో 56 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 46 మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించింది. టీమ్ఇండియా కేవలం 10 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. చివరి ఐదు వన్డేల్లోనూ ఆసీస్ గెలవడం గమనార్హం.
సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మెగాటోర్నీకి సన్నాహకంగా వన్డే సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఇటు భారత్, అటు ఆస్ట్రేలియాలు భావిస్తున్నాయి.
భారత్, ఆస్ట్రేలియా మహిళల (IND vs AUS ) వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – సెప్టెంబర్ 14న
* రెండో వన్డే – సెప్టెంబర్ 17న
* మూడో వన్డే – సెప్టెంబర్ 20న
మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చంటే..?
ఈ వన్డే సిరీస్ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఫోన్‌లలో అయితే జియో హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
వన్డే సిరీస్ కోసం ఇరు జట్లు ప్రకటించిన జట్లు ఇవే..
భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్‌కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి , రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, రాధా యాదవ్, శ్రీ చరణి, స్నేహ రాణా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్)
ఆస్ట్రేలియా జట్టు..
అలిస్సా హీలీ (కెప్టెన్), నికోల్ ఫాల్టమ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, జార్జియా వోల్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, చార్లీ నాట్, ఎల్లీస్ పెర్రీ, అన్నాబెల్ సదర్లాండ్, డార్సీ బ్రౌన్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షుట్, జార్జియా వేర్‌హామ్.