Vijay Sethupathi: హిస్టారికల్ మూవీలో విజయ్ సేతుపతి.. రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.
వెయ్యికోట్లతో తెరకెక్కుతున్న హిస్టారికల్ సినిమాలో యాక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi).
Vijay Sethupathi playing a special role in Bollywood Ramayana movie.
- బాలీవుడ్ రామాయణలో విజయ్ సేతుపతి
- స్పెషల్ రోల్ కోసం ఫిక్స్
- త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్న మేకర్స్
Vijay Sethupathi: తమిళ స్టార్ విజయ్ సేతుపతి గురించి, ఆయన చేసే సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క విలన్ గా కూడా ఆకట్టుకుంటున్నాడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi). అలాగే సైరా లాంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ కూడా చేసి మెప్పించాడు. ఇలా అన్నిరకాల పాత్రలు చేయడానికి చాలా మంది నటులు భయపడతారు. కానీ, విజయ్ సేతుపతికి అలాంటి భయాలు ఏమీ లేవు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఆయన ఏ పాత్ర చేసిన ఆడియన్స్ అంగీకరిస్తున్నారు. అది చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి మరో ప్రత్యేకమైన కథలో భాగం అవుతున్నారు విజయ్ సేతుపతి. అదే ‘రామాయణ’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి రామాయణ గాధను తెరపై ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నితీష్.
Nabha Natesh: నాజూకు పరువాలు.. నాభి అందాల జిగేలు.. నాభా నటేష్ గ్లామర్ రచ్చ.. ఫొటోలు
ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ చేస్తుండగా.. సీతగా సాయి పల్లవి చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఇండియా లెవల్లో ఉన్న చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో భాగం అవుతున్నారు. ఇప్పడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడట. రామాయణ గాథలో విభీషణుడి పాత్రకు మంచి ప్రత్యేకత ఉంది. చాలా పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. అందుకే, ఆ పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే బాగుటుంది అని భావించాడట నితీష్ తివారి.
ఆ విషయం విజయ్ సేతుపతికి చప్పగా ఆయన కూడా వెంటనే ఒప్పేసుకున్నాడట. ప్రస్తుతం ఈ పాత్రకు సంబందించిన ప్రీ వర్క్ చేస్తున్నాడట నితీష్. ఒకసారి ఫైనల్ అయ్యాక షూట్ కి వెళ్లనున్నాడట. ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న రామాయణ రెండు పార్టులుగా రానుంది. మొదటి పార్ట్ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.
