Vijay Sethupathi : నన్ను, నా ఫ్రెండ్ ని విజయ్ ఇబ్బంది పెట్టాడు.. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. స్పందించిన హీరో..
ఆ ట్వీట్ వైరల్ గా మారి విజయ్ సేతుపతి క్యాస్టింగ్ కౌచ్ చేశాడంటూ వార్తలు వచ్చాయి.

Vijay Sethupathi
Vijay Sethupathi : సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వాస్తు ఉంటాయి. ఇటీవల రమ్య అనే ఓ మహిళ.. నేను, నా ఫ్రెండ్ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాము. నన్ను, నా ఫ్రెండ్ ని విజయ్ సేతుపతి చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రస్తుతం ఆమె రీహాబిలేషన్ సెంటర్ లో కోలుకుంటుంది అని ట్వీట్ చేసింది. దీంతో ఆ ట్వీట్ వైరల్ గా మారి విజయ్ సేతుపతి క్యాస్టింగ్ కౌచ్ చేశాడంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఆ మహిళ కొన్ని నిమిషాలకే ఆ ట్వీట్ డిలేట్ చేసి, తన ఫ్రెండ్ ప్రైవసీ కోసం ఆ ట్వీట్ డిలేట్ చేసినట్లు చెప్పింది. దీంతో విజయ్ సేతుపతికి ఈ క్యాస్టింగ్ కౌచ్ మీద ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై తాజాగా విజయ్ సేతుపతి స్పందించాడు.
విజయ్ సేతుపతి రమ్య ఆరోపణలపై స్పందిస్తూ.. ఎవరో చేసిన తప్పుడు ఆరోపణలతో నేను ప్రభావితం కాను. అలాంటి ఆరోపణలు చూసి నవ్వుకున్నాను. నేను ఏంటో నాకు, నా వాళ్లకు తెలుసు. ఇలాంటి విషయాలు నన్ను భయపెట్టవు. ఇలాంటి ఆరోపణలను నేను పట్టించుకోకపోయినా నా ఫ్యామిలీ మెంబర్స్ కలత చెందుతారు. ఇది ఫేమ్, పబ్లిసిటీ కోసమే చేసారని భావిస్తున్నాను. ఇప్పటికే ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసానని తెలిపాడు.