Anirudh Ravichander : టాలీవుడ్‌లో అనిరుధ్‌కు గుడ్‌ టైమ్ స్టార్ట్ అయిందా ? థమన్, దేవిశ్రీ బౌన్స్ బ్యాక్ క‌ష్ట‌మేనా?

టాలీవుడ్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్లు అంటే థమన్, దేవిశ్రీ ప్రసాద్‌లదే హవా.

Anirudh Ravichander : టాలీవుడ్‌లో అనిరుధ్‌కు గుడ్‌ టైమ్ స్టార్ట్ అయిందా ? థమన్, దేవిశ్రీ బౌన్స్ బ్యాక్ క‌ష్ట‌మేనా?

Anirudh Ravichander good time starts at tollywood

Updated On : July 31, 2025 / 3:24 PM IST

టాలీవుడ్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్లు అంటే థమన్, దేవిశ్రీ ప్రసాద్‌లదే హవా. పెద్ద హీరోల సినిమాలైనా, భారీ ప్రాజెక్టులైనా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కోసం నిర్మాతలు, దర్శకులు క్యూ కట్టేవారు. వీరి బీజీఎంలు, పాటలు సినిమాలకు హిట్ ఫార్ములా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోతూ వస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్లుగా యంగ్‌ కుర్రోళ్లు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఒక బక్కోడు వచ్చి సరికొత్త మ్యూజక్‌తో ఇప్పుడు ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నాడు. అతనే అనిరుధ్‌ రవిచందర్. ఇప్పటికే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొలీవుడ్‌ను ఏలిన అనిరుధ్‌, టాలీవుడ్‌లోనూ తన సంగీత ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

అనిరుధ్‌ సంగీతం ఒక ఊపు ఊపుతోంది. దేవర వంటి సినిమాలతో టాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తూ, హైయెస్ట్ స్ట్రీమ్డ్ ఆల్బమ్‌గా రికార్డులు కొట్టేస్తున్నాడు. కొలీవుడ్‌లో మూను సినిమాతో 653.7 మిలియన్ స్ట్రీమ్స్, టాలీవుడ్‌లో దేవరతో 358.3 మిలియన్ స్ట్రీమ్స్ సాధించి సత్తా చాటాడు. అనిరుధ్‌ వన్‌ డేలో 25 నిమిషాల బీజీఎం కంపోజ్ చేయగల సమర్థుడని చెప్పి..దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అతని క్రేజ్‌ను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లాడు.

తన వర్క్ స్పీడ్, క్రియేటివిటీతో థమన్, దేవిశ్రీలకు గట్టి పోటీ ఇస్తున్నాడు ఈ యువకుడు. దాంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనిరుధ్‌కు దక్కతున్నాయట. ఫ్యూచర్‌లో మరిన్ని పెద్ద సినిమాలు ఆయనకు దక్కబోతున్నాయట. థమన్, దేవిశ్రీ ఇద్దరూ తమదైన స్టైల్‌తో ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నప్పటికీ, అనిరుధ్‌ జోరు ముందు వీరి మార్కెట్ కాస్త తడబడుతోందన్న టాక్ వినిపిస్తోంది. కింగ్‌డమ్, దేవర వంటి సినిమాలతో అనిరుధ్‌ యూత్‌ని ఊపేస్తున్నాడు. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తూ తన రేంజ్‌ను మరింత పెంచుకుంటున్నాడు అనిరుధ్‌. ఈ మ్యూజిక్ ఫీల్డ్‌లో థమన్, దేవిశ్రీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతారా.? లేక టాలీవుడ్‌లో అనిరుధ్‌కు గుడ్‌ టైమ్ స్టార్ట్ అయిందా అనేది వేచి చూడాలి.