Lucky Baskhar : దుల్కర్ కోసం రాబోతున్న విజయ్, త్రివిక్రమ్.. ఈ కాంబో సెట్ అయితేనా..

టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా లక్కీ భాస్కర్.

Lucky Baskhar : దుల్కర్ కోసం రాబోతున్న విజయ్, త్రివిక్రమ్.. ఈ కాంబో సెట్ అయితేనా..

Vijay Trivikram coming for Dulquer Salmaan Lucky Baskhar movie pre release event

Updated On : October 26, 2024 / 1:41 PM IST

Lucky Baskhar : టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు మేకర్స్. మరోవైపు ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ కూడా విడుదల చేసారు టీమ్. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Double Ismart : బుల్లితెరపై రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమా.. ఎప్పుడంటే..?

ఇక ఈ నెల 31న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను JRC కన్వెన్షన్‌లో రేపు (అక్టోబర్ 27న) సాయంత్రం 6:00 గంటల నుండి గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీమ్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే తాజాగా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వస్తున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ షేర్ చేశారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దుల్కర్ ఫాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కంటే ముందు వరుస మూవీస్ తో సక్సెస్ అయిన దుల్కర్ లక్కీ భాస్కర్ తో ఎటువంటి హిట్ అందుకుంటాడో చూడాలి..