Double Ismart : బుల్లితెరపై రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమా.. ఎప్పుడంటే..?

Hero Ram Pothineni double Ismart movie in zee telugu
Double Ismart : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రామ్ తో పాటు ఇటు పూరికి కూడా మంచి కంబ్యాక్ ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పార్ట్ వన్ స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ మంచి వసూళ్లు రాబట్టింది.
Also Read : CID 2 : బుల్లితెర ఆడియన్స్ గెట్ రెడీ.. ఆరేళ్ళ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చిన CID 2..
థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఓటీటీ లో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా సంజయ్ దత్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను జీ తెలుగు ఇప్పుడు ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. రామ్ తన నటనతో అదరగొట్టిన డబుల్ ఇస్మార్ట్, ఈ ఆదివారం (అక్టోబర్ 27న) సాయంత్రం6 గంటలకు, జీ తెలుగులో ప్రసారం కానుంది.
కావ్య థాపర్, రామ్ జంటగా.. గెటప్ శ్రీను అలీ, ఝాన్సీ నటీనటులుగా నటించిన ఈ సినిమా మాస్ ఎంటెర్టైనెర్ గా రూపొందింది. అయితే జీ తెలుగులో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా వస్తుంది. థియేటర్స్ లో ఈ మూవీ చూడడం మిస్సైన ఆడియన్స్ జీ తెలుగులో చూసి ఎంజాయ్ చేసేయండి…