విజయ నిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించిన సూపర్‌స్టార్ కృష్ణ
ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా విజయనిర్మల విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు..

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా విజయనిర్మల విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు..
ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా కృష్ణ విజయ నిర్మల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనిర్మల విగ్రహాన్ని హీరో కృష్ణ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, మురళీమోహన్, మహేష్ బాబు, నమ్రత, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, గల్లా జయదేవ్, నిర్మాత పివిపి, పరుచూరి గోపాల కృష్ణ, ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, నందిని రెడ్డి బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ : ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలు చెయ్యడం ఒక చరిత్ర. ఈరోజు ఆవిడ వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు’’ అన్నారు.
నరేష్ మాట్లాడుతూ : ‘‘ప్రతి తల్లి ఒక అమ్మవారు. అమ్మ దీవెనలు వున్న వారు శిఖరాన్ని అందుకుంటారు. మా అమ్మ కృష్ణ గారి దీవెనలతో ఇద్దరు కలసి ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. నాకు ఎప్పుడూ మంచి చెబుతూ ధైర్యం నిచ్చారు. అమ్మదీవెనలు అందరికీ వుండాలి. మా వెల్ఫేర్ కోసం నేను ఎప్పుడూ ముందు వుంటాను. అమ్మ పేర అవార్డుని నటీ నటులకు ప్రతి సంవత్సరం అందిం చనున్నాము’’. అని తెలిపారు.
విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డు పురస్కారాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేష్ బాబు కలిసి అందచేశారు. నందిని రెడ్డి మాట్లాడుతూ : ‘‘ఆవిడ పేర అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. రాబోయే రోజుల్లో మరింత మంది ఈ అవార్డు తీసుకోవాలి. ఈరోజు మహేష్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా హ్యాపీగా వుంది’’ అన్నారు.
Read More>>గొప్ప దర్శకురాలు భార్య కావడం నా అదృష్టం – సూపర్‌స్టార్ కృష్ణ