Anakapalli Trailer : ‘అనకాపల్లి’ ట్రైలర్ రిలీజ్.. నిర్మాత, నటుడిగా మారిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే కాక కథ, స్క్రీన్ ప్లే అందించి నటుడిగా కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారు. ( Anakapalli Trailer)
Anakapalli Trailer
Anakapalli Trailer : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్స్ పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాణంలో ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే కాక కథ, స్క్రీన్ ప్లే అందించి నటుడిగా కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారు. ఈ సినిమా ఆగస్ట్ 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. మీరు కూడా అనకాపల్లి ట్రైలర్ చూసేయండి..
Also Read : Ritika Nayak : నేను దయ్యాలను నమ్ముతాను.. ఆ రోజు.. మిరాయ్ భామ రితిక కామెంట్స్ వైరల్..
విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో ఈ ట్రైలర్ను టాలీవుడ్ థండర్స్ టీం కలిసి వేలాది మంది సమక్షంలో విడుదల చేసారు. హీరో శ్రీకాంత్, తమన్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ట్రైలర్ను విడుదల చేసి అభినందనలు తెలిపారు.

