Spark The Life : ‘స్పార్క్-ది లైఫ్’ మూవీ రివ్యూ.. సరికొత్త పాయింట్‌ని థ్రిల్లింగ్ గా చూపించి..

యువ నటుడు విక్రాంత్ హీరోగా నటిస్తూనే దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా నేడు నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Spark The Life : ‘స్పార్క్-ది లైఫ్’ మూవీ రివ్యూ.. సరికొత్త పాయింట్‌ని థ్రిల్లింగ్ గా చూపించి..

Vikranth Mehreen Spark The Life Movie Review and Rating

Spark The Life Review : యువ నటుడు విక్రాంత్ హీరోగా నటిస్తూనే దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా నేడు నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విక్రాంత్ సినిమాని డైరెక్ట్ కూడా అచేయడం విశేషం.

కథ విషయానికొస్తే.. మెడికోగా ఉన్న జై(విక్రాంత్) కొందరు అమ్మాయిలని ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు కాసేపాటికే సైకోలుగా బిహేవ్ చేస్తూ చనిపోతారు. ఇలా అనేక హత్యలు జరుగుతుండటం, జైని కొంతమంది అనుమానించడం జరుగుతుంది. ఇదే సమయంలో హీరో.. మెహ్రీన్, రుక్సార్ లతో ప్రేమని నడిపిస్తాడు. పోలీసులకు అనుమానమొచ్చి జైని అరెస్ట్ చేస్తారు. దీంతో జై ఎవరు? అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు? ఈ హత్యలకు జైకి సంబంధం ఏంటి? అని సాగుతూనే ఉగ్రవాదుల మైండ్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే కొత్త పాయింట్ కూడా కథలో చెప్పారు. వీటన్నిటి గురించి తెలియాలంటే తెరపై స్పార్క్ చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. మొదటి భాగం లవ్ ట్రాక్, హత్యలతో సాగుతుంది. ఇంటర్వెల్ కి కథ ఆసక్తిగా మారుతుంది. హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆసక్తి పెరుగుతుంది సినిమాపై. ఇక సెకండ్ హాఫ్ లో మరో కథలోకి తీసుకెళ్లారు. మన దేశంలోనే ఉండే ఉగ్రవాదుల్ని కొన్ని ప్రయోగాలతో వాళ్ళ మెదడుని మన కంట్రోల్ తెచ్చుకోవచ్చు అని చెప్తూ కొన్ని సన్నివేశాలు తీసుకున్నా అక్కడక్కడా క్లారిటీ మిస్ అవుతుంది. అయితే కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్, భారీ కథే. కొత్తవాడు హీరోగా చేయడం, అతనే డైరెక్టర్ గా చేయడంతో ఎవరైనా ఇలాంటి కథలకు సూట్ అయ్యే తెలిసిన హీరో చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ గా తీసేవాళ్ళేమో అనిపిస్తుంది. అక్కడక్కడా సత్య కామెడీ పండించాడు. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని సినిమాలు లాజిక్ వదిలేసి చూడాల్సిందే అని మనకు తెలుసు.

నటీనటుల విషయానికొస్తే.. కొత్తవాడైనా విక్రాంత్ రెండు వేరియేషన్స్ తో మెప్పించాడనే చెప్పొచ్చు. రుక్సార్, మెహ్రీన్ తమ అందాలతో పాటలు కొన్ని ఎమోషన్ సీన్స్ లో అలరించారు. సీనియర్ నటి సుహాసిని ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ గా సత్య మంచి కామెడీ పండించాడు. పోలీసాఫీసర్ గా బ్రహ్మాజీ, నాజర్, షాయాజీ షిండేలు మెప్పించగా నెగిటివ్ రోల్ లో మలయాళ నటుడు గురు సోమసుందరం అదరగొట్టారనే చెప్పొచ్చు.

Also Read : Sapta Sagaralu Dhaati Side B : సప్త సాగరాలు దాటి సైడ్ B రివ్యూ.. హీరో జైలు నుంచి బయటకు వచ్చి ఏం చేశాడు?

టెక్నికల్ అంశాలు.. సినిమాటోగ్రఫీ మాత్రం కొత్తగా బాగావుంది. కొన్ని సీన్స్ లో కెమెరా విజువల్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన హేశం అబ్దుల్ వహీద్ ఈ సినిమాకు సరికొత్తగా మ్యూజిక్, BGM ఇచ్చారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా ‘స్పార్క్.. ది లైఫ్’ ఓ సరికొత్త పాయింట్ ని థ్రిల్లింగ్ గా చూపించారని చెప్పొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..