Vindu Dara Singh : ఎవ్వరు చెప్పినా వినలే.. ప్రభాస్‌కు సైతం చెడ్డ పేరు : వింధూ ధారా సింగ్
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్.

Vindu Dara Singh calls Prabhas starrer Adipurush a huge mistake
Vindu Dara Singh : ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్. ఈ చిత్ర రిలీజ్‌కు ముందు ప్రభాస్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మాస్టర్ పీస్‌గా నిలిచిపోతుందని అభిమానులు భావించగా భారీ ఫ్లాప్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా పై బాలీవుడు నటుడు వింధూ ధారా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ మూవీని దర్శకుడు పెద్ద గందరగోళంగా తీసి ప్లాప్ చేశారన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలను చేశాడు.
ఈ మూవీలో నటించిన కొందరు నటీనటులు సినిమాలోని కొన్ని సంభాషణలను మార్చాలని దర్శకుడు ఓం రౌత్‌ను అడిగారు. డైలాగులు నోరు తిరడం లేదని, చెప్పేందుకు అంత సౌకర్యవంతంగా కూడా లేవన్నారు. చిత్రం విడుదల అయ్యాక ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ తప్పవని అతడికి సూచించారు. అయితే.. ఎవరు ఏమీ చెప్పినా కూడా దర్శకుడు వినలేదు. తనకు నచ్చినట్టుగానే ఆదిపురుష్‌ను తెరకెక్కించారు. ఇక విడుదలైన తరువాత చూస్తే బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్‌గా నిలిచింది. ప్రభాస్‌కు సైతం చెడ్డ పేరు తీసుకువచ్చిందని వింధూ అన్నాడు.
Kalingaraju : ‘కళింగరాజు’ ఫస్ట్ లుక్ రిలీజ్.. పీరియాడిక్ యాక్షన్ డ్రామానా..!
రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లు నటించడంతో ఆదిపురుష్ ప్రాజెక్టు పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కాయమని భావించారు. అయితే.. టీజర్ విడుదల అయినప్పుడే ట్రోలింగ్ బారీన పడింది. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ కామెంట్లు చేశారు. దర్శకుడు ఓం రౌత్‌ను ఏకీపారేశారు.
హనుమాన్ సినిమా విడుదలైన తరువాత సైతం..
ప్రశాంత్ వర్మ దర్శకతంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్‌ను ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. రూ.40కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న హనుమాన్ సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ చూపించారని, రూ.700తో బడ్జెట్‌ను ఓం రౌత్ ఏం చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.